ముస్లిం మహిళలతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆత్మీయ చర్చలు

MLA Peddired Reddy talks with Muslim women

MLA Peddired Reddy talks with Muslim women

Date:05/12/2018

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఉబేదుల్లాకాంపౌండులో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, మహిళా నాయకురాలు సాజిదా ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో హాజరై, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆత్మీయ చర్చలు చేపట్టారు. బుధవారం పట్టణంలో గడపగడకు వైఎస్‌ఆర్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్‌వీధి, ఉబేదుల్లాకాంపౌండు, రహమత్‌నగర్‌, గాంధినగర్‌, ఏటిగడ్డపాళ్యెం, చెంగలాపురం ప్రాంతాలలో ఆయన పర్యటించారు. పర్యటనలో నవరత్నాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉబేదుల్లాకాంపౌండులో ముస్లింమహిళలకు పెద్దిరెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు. వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ముస్లింలు చురుగ్గా ప్రచారం చేపట్టాలని కోరారు. దీనిపై ముస్లిం మహిళలు మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు విశ్రమించేది లేదని హామి ఇచ్చారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రజలు రుణాలు, పెన్షన్లు, గృహాలు మంజూరు చేయాలని వినతిపత్రాలు అందజేశారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి స్పందిస్తూ అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నవరత్నాల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కౌసర్‌ నర్సింగ్‌హ్గమ్‌ డాక్టర్లు సబిహకౌసర్‌, సుగుణమ్మ, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్ కార్యదర్శి ఆర్షద్‌అలీ కలసి సన్మానించి , మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, పార్టీ సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, ఇబ్రహిం, ఆసిఫ్‌, రేష్మా, మనోహర్‌, మంజుల తదితరులు పాల్గొన్నారు.

శంఖుస్థాపనలు…

పట్టణంలోని ఉబేదుల్లాకాంపౌండులో కాలువలు, వీధులు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూజలు చేసి,ప్రారంభించారు. అలాగే రహమత్‌నగర్‌ కాలువ, పైపులైను పనులను ప్రారంభించారు. ఉబేదుల్లాకాంపౌండులోని ఉర్ధూపాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి, ముస్లిం విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే మూగ, చెవిటి వారి కేంద్రాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పరిశీలించి, వారితో కలసి కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. మూగ, చెవిటి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారికి అవసరమైన సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆసిఫ్‌, రెడ్డిశేఖర్‌ పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన దేశం కార్యకర్తలు

Tags; MLA Peddired Reddy talks with Muslim women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *