ముస్లింలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఇఫ్తార్‌ విందు

MLA Pendireddy Iftar dinner for Muslims

MLA Pendireddy Iftar dinner for Muslims

Date:19/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఆదివారం రాత్రి పుంగనూరు ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందును షాదిమహాల్‌లో ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు షా, కార్యదర్శి అమ్ము్య ధ్వర్యంలో ముస్లిం పెద్దలు ఏర్పాటు చేశారు. అంజుమన్‌ షాదీమహాల్‌లో ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉబేదుల్లా కాంపౌండులో షామీర్‌, అంజాద్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందులో ఎమ్మెల్యే పాల్గొని , శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని అంజుమన్‌ కమిటి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలోని ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ముస్లింలకు ఎలాంటి సమయంలోనైనా అండగా ఉంటామని హామి ఇచ్చారు. ముస్లింల అభివృద్ధి కోసం తన భాస్కర్‌ ట్రస్ట్ నుంచి నిధులు అందజేస్తున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాలనలో ముస్లింలకు ఆగ్రస్థానం కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్లు ఎంఎస్‌.సలీం, నయాజ్‌, ఆసిఫ్‌, పార్టీ నేతలు ఇప్తికార్‌, ఖాన్‌, అఫ్సర్‌, నూరుల్లా, సిద్దిక్‌, ఖాజా, ఇర్ఫాన్‌, ఆయాజ్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి, నాగరాజారెడ్డి, సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, విశ్వనాథ్‌, నారపరెడ్డి, ముస్లింలు ఇంతియాజ్‌, ఎంఏఎన్‌.నూరుల్లా, కిజర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి

Tags: MLA Pendireddy Iftar dinner for Muslims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *