రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గోన్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ ముచ్చట్లు:
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి మహిపాల్ చెరువు గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా అక్క చెల్లెమ్మలు తరలివచ్చి ఎమ్మెల్యేకి రాఖీ కట్టారు. స్వీట్స్ తినిపించి, హారతులిచ్చి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టింటి సారిగా మహిళలకు చీరలు అందజేశారు.
Tags: MLA Ponnada Satish participated in the Rakhi Purnami celebrations

