స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ముంపు గ్రామాల్లో పర్యటించిన ఉండి ఎమ్మెల్యే రామ రాజు

Date:22/10/2020

ఏలూరు  ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు పరిధిలోని పలు గ్రామాలు పరిసర ప్రాంతాలు ఇంకా వరద ముంపు లోనే ఉన్నాయి. ఉండి నియోజకవర్గం ఆకివీడు గ్రామంలో వరద ముంపునకు గురైనప్రాంతాల్లో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పర్యటించారు. ఉండి ఎమ్మెల్యే రామ రాజు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులనుపరామర్శించారు.గత ఐదు రోజులుగా కొల్లేరు ఉప్పుటేరు పొంగి ఆకివీడు గ్రామం తో పాటు పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. వరద ముంపు లో ఉన్న ఆకివీడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్నిఎమ్మెల్యే సందర్శించి వైద్య సిబ్బందిని ముంపు బాధితులకు అందిస్తున్న వైద్య సహాయం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని,ముంపు బాధితుల కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే బాధితులకు హామీ ఇచ్చారు.

జవహర్‌అలి జన్మదిన వేడుకలు

Tags: MLA Rama Raju himself drove a tractor and toured the flooded villages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *