బీజేపీ నేతల పై ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫైర్
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మాల్ జిల్లా ఖానాపూర్ లో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్,ఎంపీ సోయం బాపురావు,రాథోడ్ రమేష్ లు ఎమ్మెల్యే రేఖానాయక్ పై చేసిన ఆరోపణల పై రేఖనాయక్ స్పందించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై నోరు జారితే నాలుక కోస్తాం జాగ్రత్త బండి సంజయ్ అంటూ హెచ్చరించారు. నువ్వేన్ని జూట మాటలతో అరిచిన ప్రజలు ఎవ్వరు నిన్న బీజేపీని పట్టించుకోరని అన్నారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు ప్రజలకు ఏం అభివృద్ధి చేసినవో చెప్పు అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రాకముందే నాకుఆస్తులున్నాయన్నారు. బీజేపీ నాయకులు నాగురించి గాని టిఆర్ఎస్ గురించి గాని మాట్లాడితే బొందపెట్టి గోరి కడుతం కబడ్ధార్ అని ఎమ్మెల్యే రేఖానాయక్ హెచ్చరించారు.
Tags: MLA Rekha Naik fires on BJP leaders

