వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే  సండ్ర

ఖమ్మంముచ్చట్లు:

సత్తుపల్లి నియోజకవర్గంలో పంట కల్లాలలో ఉన్న ధాన్యం నిల్వలను కొనుగోలుకు సత్వర ఏర్పాట్లు చేయాలని కోరుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య  హైదరాబాదులో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని వారి కార్యాలయంలో కలిశారు. కొద్దిరోజులుగా అధిక వర్షాలు పడుతున్నాయని, కొనుగోలు జాప్యం చేస్తే వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో నష్టం సంభవించే అవకాశం ఉందని దాన్యం దిగుమతికి పెద్దపల్లి మిల్లర్లతో మాట్లాడి దిగుమతులకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి  పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ కి ఫోన్ చేసి దిగుమతులకు ఏర్పాట్లు చేయాలని మిల్లర్లతో మాట్లాడాలని వారికి తెలిపి, కమీషనర్ ని ఆదేశించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:MLA Sandra meets Agriculture Minister Niranjan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *