ఎమ్మెల్యే సీట్లు.. వాళ్లకి…ఎంపీ  సీట్లు వీళ్లకు

Date:17/01/2020

విజయవాడ ముచ్చట్లు:

అందరు అనుకున్నట్లే బిజెపి – జనసేన దోస్తీ కట్టేశాయి. వీరి పొత్తు పొడుపు కోసం గత కొద్ది నెలలుగా ఇరు పార్టీల్లో చర్చలపై చర్చలే నడిచాయి. కలిసి ప్రజాసమస్యలపై పోరాటం, ఉద్యమాలు పైకి ఇరు పార్టీలు చెప్పే మామూలు మాటలే. కానీ అంతర్గతంగా పొత్తు ఇంతకాలం సెట్ కాకపోవడానికి అనేక రీజన్స్ చెబుతున్నారు విశ్లేషకులు. తమతో దూరమైన పవన్ కల్యాణ్ పార్టీని కలుపుకోవడానికి కమలం ఏమీ ఉత్సహం చూపించలేదు. అయితే వైసిపి తో పెరిగిన వైరం కాషాయం తో కలిస్తే కానీ ముందుకు వెళ్లలేని అనివార్యతను పవన్ కల్యాణ్ కి కల్పించాయి.అందుకోసం తనకున్న సోర్స్ అన్నింటిని పవన్ కల్యాణ్ ఉపయోగించారు. బెంగళూరు ఎంపి సూర్య తేజస్వీ, మైసూర్ ఎంపి ప్రతాప్ సింహ ఇటీవల పవన్ అభిమానులమంటూ ఆయన ఆహ్వానం పై వెళ్లారు. వారిద్దరూ సెల్ఫీలకు వచ్చారంటూ పైకి రెండు పక్షాలు ప్రకటించినా అంతర్గతంగా బిజెపి అధిష్టానం వద్ద అపాయింట్ మెంట్ కోసమే పవన్ కల్యాణ్ ప్రయత్నం చేశారన్నది తేలిపోయింది. అనుకున్నట్లే యువ ఎంపిలు పార్టీ అధ్యక్షుడు నడ్డా తో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేశారు. అందుకే బిజెపి ఎపి ఇంచార్జ్ సునీల్ దేవధర్ తో పాటు సూర్య తేజస్వీ కూడా జనసేనాని నడ్డాను కలిసినప్పుడు దగ్గరే వున్నారు.బిజెపి అధిష్టానం జనసేన ముందు తమ ప్రొపోజల్స్ ఉంచింది. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు స్థానాలు ఎక్కువ  మొత్తంలో తమకు అసెంబ్లీ స్థానాలు అధిక సంఖ్యలోజనసేనకు వదిలి పెట్టడం డీల్ లో ప్రధాన అజండా గా ప్రచారం నడుస్తుంది.

 

 

 

 

అసెంబ్లీలో కూడా కొన్ని స్థానాల్లో కమలం బరిలోకి దిగేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. ఇక స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కడ బలం వుందన్నది గుర్తించి అందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని కమలం అధిష్టానం సూచించినట్లు టాక్. అలాగే టిడిపి, వైసిపి లతో సమానదూరం ఉంటుందని వారితో జతకట్టే అవసరం ఇరు పార్టీలకు ఉండకుండా ఎదగాలన్నది అంతర్గత సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.తెలంగాణ లో సైతం ప్రధాన శక్తిగా బిజెపి అవతరించేందుకు పవన్ కల్యాణ‌ తోడు ఎంతోకొంత ప్రయోజనం చేకూరుస్తుందని భావించే ఈ డీల్ ను కమలం అధిష్టానం తెచ్చిందంటున్నారు విశ్లేషకులు. వీటన్నిటికీ పవన్ కల్యాణ‌్ ఒకే చెప్పేయడంతో ఆలస్యం లేకుండా ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకు తిరగాలని నిర్ణయించారని అంటున్నారు. తమ మధ్య ఒప్పందం అయిపోయినా మమ అనిపించుకోవడానికి రాష్ట్ర బిజెపి నాయకత్వంతో కో ఆర్డినేషన్ కి ఒక సమావేశం నిర్వహించుకోవాలని కమలం పెద్దల సూచనలను ఇరు పార్టీలు అమల్లో పెట్టి తంతు పూర్తి చేశారు. ఇప్పుడు వీరి ప్రయాణం ఎలా ఉంటుందో వేచి చూడాలి.జేపీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ స్వరం మారిందా? ఆయన తెలుగుదేశం పార్టీని కూడా ఇక టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. బెజవాడ భేటీతో పవన్ లో వచ్చిన మార్పునకు కారణాలేంటన్న చర్చ జరుగుతోంది.

 

 

 

 

గత కొన్నాళ్లుగా పవన్ కల్యాణ్ వైసీపీనే టార్గెట్ చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీనే పవన్ కల్యాణ్ తప్పు పట్టేవారు. జగన్ సీఎం ఎప్పటికీ కాలేరని కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీని పన్నెత్తు మాట అనలేకపోయారు. దీంతో పవన్ కల్యాణ్ టీడీపీకి అనుకూలమని, చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటారన్న అభిప్రాయం బలంగా నెలకొంది. అయితే 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేశారు. కర్ణాటక తరహాలో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చని భావించారు. కానీ పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.అయితే ఎన్నికల తర్వాత వైసీపీని పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. చంద్రబాబు విషయంలో కొంత మెతకవైఖరినే అవలంబిస్తున్నారు.

 

 

 

 

అమరావతి తరలింపు అంశంలోనూ టీడీపీ చేస్తున్న డిమాండ్ వైపు మొగ్గుచూపారు. తాజాగా బీజేపీ నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పంపారని వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఎట్టకేలకు బీజేపీ, జనసేన పార్టీలో బెజవాడలో భేటీ అయి కలసి పనిచేయాలని నిర్ణయించాయి.పవన్ కల్యాణ్ కు బీజేపీ నేతలు విస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు తమకు ప్రధాన శత్రువని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అధికార వైసీపీ ఎంతో? చంద్రబాబు కూడా అంతేనని, ఆయన విషయంలో ఎలాంటి మెతకవైఖరిని అవలంబించబోమని కూడా బీజేపీ నేతలు తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇది తమ స్టాండ్ అని బీజేపీ నేతలు స్పష్టం చేయడంతోనే భేటీ తర్వాత పవన్ కల్యాణ్ తన స్వరాన్ని మార్చారు.

 

 

 

 

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతితో పాటు రాజధానికి అన్ని ఎకరాలు అవసరం లేదని తాను ఆనాడే చెప్పానని పవన్ కల్యాణ‌్ చెప్పడం విశేషం. వైసీపీని ఎంత విమర్శించారో? అంతే స్థాయిలో టీడీపీని కూడా దునుమాడటం పవన్ లో వచ్చిన మార్పునకు నిదర్శనమంటున్నారు. టీడీపీ స్కీం బీజేపీలో వర్క్ అవుట్ అవదని పవన్ కల్యాణ్ గ్రహించినట్లుంది.

మంత్రి వనితకు స్వల్ప గాయాలు..

 

Tags; MLA seats .. They … MP seats

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *