రోగులకు ఎమ్మెల్యే సేవలు

Date:30/03/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలంతా నిర్బంధంలో ఉండిపోయారు. ఈ క్రమంలో కొందరికి వైద్యపరమైన ఇతర అత్యవసర సేవలు అనివార్యమవుతున్నాయి. ఇలాంటి ఏ సమస్య ఉన్నా 100 నంబరుకు ఫోన్ చేసి సహాయం పొంద వచ్చని సూచిస్తున్నారు. ప్రభుత్వ సూచనలను చాలా మంది ప్రజలు వినియోగించుకుంటున్నారు.వికారాబాద్‌ జిల్లా మోమీన్‌పేట మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన సుధారాణి అనే మహిళకు కూడా అత్యవసర వైద్యం అవసరమైంది. ఆమె 9 నెలల నిండు గర్భిణి. సుధారాణికి ఎమర్జెన్సీ ఉందని ఆమె భర్త నవరత్నం హెల్ప్‌లైను నంబర్‌కి ఫోన్‌ కాల్‌ చేశాడు. దీంతో వారు స్పందించి వైద్య సాయం ఏర్పాటు చేశారు. ఈలోపు ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌‌కు తెలిసింది. ఆయన వెంటనే సుధారాణి ఇంటికి చేరుకున్నారు.ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వృత్తి రీత్యా డాక్టర్‌ అన్న సంగతి తెలిసిందే.‌ గర్భిణీ అయిన సుధారాణిని పరీక్షించిన ఆయన, ఆమెకు రక్తం తక్కువగా ఉందని పౌష్టికాహారం బాగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్‌ సూచించారు. కాన్పుకు ఇంకా 20 రోజుల సమయం ఉందని తెలిపారు. ఈలోపు కనుక పురిటినొప్పులు వచ్చినట్లయితే వెంటనే తనకు ఫోన్‌ చేయాలని ఎమ్మెల్యే తన ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. సుధారాణికి కావాల్సిన మందుల చీటీని రాసి ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచి నవనీత విష్ణువర్థన్‌ రెడ్డి, నరసింహ రెడ్డి తదితరులు ఉన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వాళ్ల దగ్గర నుంచే కరోనా

Tags:MLA services for patients

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *