40 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు రైతు నగరంలో 20 లక్షల రూపాయలతో డ్రైనేజీ 20 లక్షల రూపాయలతో స్మశాన వాటిక అభివృద్ధి పనుల ను నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ ,పామ్ షావలి, వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి శనివారం నాడు ప్రారంభించారు, ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు రైతు నగరం నందు 40 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనులు మరియు స్మశానవాటిక అభివృద్ధి పనులను నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. రైతు నగరం మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మరింత అభివృద్ధి జరగడం ఎంతో సంతోషకరమని ప్రజలు కూడా మున్సిపాలిటీలో కలవడంతో వారి గ్రామం అభివృద్ధి పనులు జరుగుతుండడంతో ఆర్షం వ్యక్తం చేయడం చాలా సంతోషకరమన్నారు, వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రైతు నగరం ను మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు రామ సుబ్బారెడ్డి, రాజశేఖరరెడ్డి ,భాస్కర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, మరియు రైతు నగరం క్రాంతి నగర్ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Tags: MLA Shilpa Ravichandra Kishore Reddy started the development works with 40 lakhs
