తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి హామీ
మండలంలోని రైతులు ఆందోళన చెందవద్దండి.
ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేయవద్దండి …
వైకాపా మండల కన్వీనర్ జిట్టా నగేష్ యాదవ్
తుగ్గలి ముచ్చట్లు:

తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేందుకు ఎమ్మెల్యే శ్రీ దేవి హామీ ఇచ్చినట్లు వైకాపా మండల కన్వీనర్ జిట్టా నగేష్ యాదవ్ తెలిపారు.బుధవారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుగ్గలి మండలంలో రైతులు పంట సాగు ఎక్కువ చేశారనే కారణంతో కరువు మండలంగా అధికారులు ప్రకటించలేదన్నారు.అయితే వర్షాలు సక్రమంగా రాకపోవడంతో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయాయని ఆయన తెలిపారు.అందువలన ఈ విషయాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి దృష్టికి మండల వైకాపా నాయకులు తీసుకువెళ్లడం జరిగిందన్నారు.ఈ విజయంపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తో ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగిందన్నారు.అందుకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటిస్తానని ఎమ్మెల్యే శ్రీదేవి కు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.అవసరమైతే సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి కచ్చితంగా తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే విధంగా చూస్తానని ఎమ్మెల్యే శ్రీదేవి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.అందువల్ల ఈ విషయంపై రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా రాజకీయాలు చేయవలసిన అవసరం లేదన్నారు.జగనన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని,రైతులకు ఏనాడు ఇబ్బంది కలిగే నిర్ణయాలు జగనన్న ప్రభుత్వం తీసుకోదని ఆయన తెలిపారు.రైతుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను జగనన్న ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన తెలిపారు.
Tags: MLA Sridevi assured to declare Tuggali mandal as drought mandal
