Natyam ad

మాతమ్మ విగ్రహ ప్రతిష్ఠ పూజలలో పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

రామాపురం ముచ్చట్లు:

మాతమ్మ తల్లీ ప్రజలందరినీ చల్లంగా చూడు తల్లీ అంటూ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రామాపురం మండలం గోపగుడిపల్లె గ్రామం కాంపల్లె హరిజనవాడలో జరిగిన మాతమ్మ విగ్రహ ప్రతిష్ఠ పూజలలో ముఖ్య అతిధిగా శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి దయవల్ల వర్షాలు సంవృద్దిగా కురిసి, రైతులు ,ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.హోమాలలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాధ రెడ్డి,సర్పంచ్ లుముంగర సుబ్బయ్య, రఘురామయ్య, శివయ్య, ఉప సర్పంచులు శివయ్య, బాబు, నాయకులు మల్లయ్య, సుబ్బయ్య, శివయ్య,రెడ్డెయ్య, శివరామకృష్ణ,చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: MLA Srikanth Reddy participated in the Matamma idol worship

Post Midle