Natyam ad

వైఎస్ఆర్ సిపి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

చిన్నమండెం మండలం, చాకిబండ లో  ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుకు ఒటేయాలని విజ్ఞప్తి చేస్తోన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రతివీదిలో బాణ సంచాలు కాల్చి, గజమాల లతో స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు.

Post Midle

ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రేస్మీట్ కామెంట్స్

చంద్రబాబు తన 15 ఏళ్ల పాలనలో ఏమి మంచి చేశాడో? ఏమి చేయబోతాడో అని విందామని ఆశగా చూశాం.చంద్రబాబు ఏమి చేయలేదని ప్రతి ఒక్కరికి తెలుసు.ఎన్నికల సమయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి పై, స్థానిక ఎమ్మెల్యేలపై బురద జల్లు వెళ్లడమే చంద్రబాబు ప్రజాగళం యాత్ర భావన.పేద ప్రజలకు సంక్షేమం అందిందంటే నాడు మహానేత వైయస్సార్ నేడు సీఎం జగన్ వల్లే.ఆరోగ్యశ్రీ వల్ల నేడు రాష్ట్రంలో వేలాదిమంది ప్రాణాపాయ స్థితి నుంచి మేలుకొని ఆరోగ్యంగా ఉన్నారు.ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంతో మంది యువతీ యువత ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు.జలయజ్ఞం వల్ల ప్రాజెక్టులకు రూపకల్పన చేయడమే కాకుండా 90 శాతం పనులు కూడా పూర్తి చేసిన ఘనత వైయస్ కుటుంబానికి చెందుతుంది.

 

 

15 ఏళ్లు సీఎం గా ఉండి సంక్షేమము చేయక, అభివృద్ధి చేయక కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు.జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా రాజంపేట, మదనపల్లి లను జిల్లాలు చేస్తాను అందరికీ సమన్యాయం చేస్తానంటున్న చంద్రబాబు ఆరు నియోజకవర్గాలను మూడు జిల్లాలుగా ఏ విధంగా చేస్తారో చెప్పాలి.70 వేల కోట్ల సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదరికం తగ్గించారు.కరోనా వల్ల రెండు సంవత్సరాలు రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఐదు సంవత్సరాలు సంక్షేమాన్ని అమలు చేసిన వ్యక్తి జగన్ ప్రతి గ్రామంలో నేడు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, పాల డైరీలు, లైబ్రరీలు, శాశ్వతమైన అభివృద్ధి కనబడుతుంది.అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఆవిర్భవించడం కేవలం రెండేళ్లలో రాష్ట్రంలో 26 జిల్లాలకు దీటుగా అభివృద్ధి చెందుతూ ఉండడం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది

 

 

 

చంద్రబాబు సంక్షేమము చేయక అభివృద్ధి చేయక రాయచోటికి ఏం చేశాడో కూడా చెప్పలేడు.70 వేల కోట్లు సంక్షేమానికి ఉద్యోగస్తుల జీతాలకు ఇస్తామంటున్న చంద్రబాబు మూడు లక్షల కోట్లకు హామీలు ఇచ్చాడు. వాటిని ఎలా అమలు చేస్తాడో చెప్పని చంద్రబాబుకి క్రెడిబుల్టీ లేదు.ప్రజలను మభ్య పెట్టాలని నెగ్గాలనుకుంటున్న చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.జగన్ చెప్పినవన్నీ చేశాడు కాబట్టి ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు. అయినా చేసేదే ఆయన చెప్పాడు.రైతు భరోసా పేరుతో రైతులను ఆదుకున్నాడే తప్ప రుణమాఫీ పేరుతో మోసం చేయలేదు.ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు చెప్పడం దానికి పెద్ద హెడ్డింగ్ లతో పచ్చ మీడియా ప్రచురించడం వారికి ఫ్యాషన్ అయిపోయింది.నేనాడు తప్పు చేయలేదు తప్పు చేసిన రోజున రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని ఎప్పుడో చెప్పాను.

 

 

ప్రభుత్వ భూములకు సంబంధించి నియోజకవర్గంలోని ప్రతి రెవెన్యూ కార్యాలయంలో నోటీస్ బోర్డులో రికార్డును ఉంచాం.రాయచోటి రింగ్ రోడ్ అలైన్మెంట్ లోను, జిల్లా కేంద్రం ఏర్పాటుతోనూ, చుక్కల భూముల పరిష్కారంలోనూ ప్రజలకు మేలు జరిగిందే తప్ప అందులో ఎక్కడైనా ఒక సెంటు భూమి నాకు లేదు.ప్రజలకు మంచి జరిగినా, అభివృద్ధి జరిగినా అవినీతి ఆరోపణలు చేయడమే తెలుగుదేశం నాయకులు నైజం.రాయచోటిలో భూములు కబ్జాలు ఎవరు చేశారు? అరాచకాలు ఎవరు చేసారో ప్రజలకు తెలుసు.వారి చిట్ట బయట పెట్టాలంటే ఒక్క క్షణం చాలదు.శ్రీకాంత్ రెడ్డి మంచి చేశాడు కాబట్టే ఆ భగవంతుడు చంద్రబాబు నోటి నుంచే శ్రీకాంత్ రెడ్డిని గెలిపించండి అని చెప్పించాడు.మాపై ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం నాయకులు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? ప్రాణాంతక వైరస్ అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కనబడకుండా దాక్కున్న వ్యక్తులు మీరు కాదా?ప్రాణం పోతుందని తెలిసిన నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజలకు అండగా నిలిచింది మేము కాదా?

 

 

 

గడప గడప కార్యక్రమంలో నిత్యం ప్రజలతో మమేకమయ్యాం, మీరు ఏనాడైనా ప్రజల దగ్గరికి వెళ్లారా?కేవలం పసలేని ఆరోపణలు చేయడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం, బురద జల్లడం తప్ప తాము ఫలానా చేసామని చెప్పే ధైర్యం లేదు.2200 కోట్లతో గండికోట నుంచి వెలిగల్లు కు౫నీరు తెప్పించే పనులను 70 శాతం పూర్తి చేసాం. రెండు సంవత్సరాల్లో చెరువులకు నీళ్లు నింపుతాం.260 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం.రెండు లక్షల 50 వేల చదరపు అడుగుల్లో 100 కోట్లతో కలెక్టరేట్ నిర్మాణం జరగబోతోంది.190 కోట్లతో పీజీ సెంటర్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.మేము ఇంటింటికి ఇస్తున్న ప్రచార కరపత్రంలోనే ఏమి చేసాము ఏమి చేయబోతున్నాము స్పష్టంగా తెలియజేశాం.ప్రజల జీవనశైలి మార్చడం కోసమే రాజకీయం చేస్తాం తప్ప అంగు ఆర్భాటాల కోసం కాదు.2014 మేనిఫెస్టో లో చంద్రబాబు ఏమి చేశాడు, ఇప్పటి మేనిఫెస్టో లో ఏమి చేస్తాడో క్రేడిబులిటి లేదు.రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ 650 హమీలిచ్చి ఏ ఒక్కటి చేయలేదు.జగన్ ఇచ్చిన హామీలు అమలు చేశాడు, వాటినే మేరుగు పరచి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా వున్న చేస్తాను అంటున్నాడు.

 

 

ప్రజల స్పందన చూస్తుంటే గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని తెలుస్తోంది.పేన్షన్ లు అవ్వతాతలకు అందిస్తే జగన్ కు సానుభూతి వస్తుందని తన తోత్తు అయినంటు వంటి నిమ్మగడ్డ రమేష్ తో కోర్టులో పిటిషన్ వేయించడం వల్ల వికలాంగులు, అవ్వతాతలు ఇబ్బందులకు గురయ్యారు. కోంతమంది ప్రాణాలు కోల్పోయారు.కాకుళారం కు చెందిన ముద్రగడ సుబ్బన్న కూడ చనిపోవడం జరిగింది.14 ఏళ్లు సిఎం గా వున్నప్పుడు వాలంటీర్లను పెట్టాలి, ఇంటికి పేన్షన్ పంపించాలి అన్న ఆలోచన చంద్రబాబు కు ఎందుకు రాలేదు.జన్మభూమి కమిటీలు అంటావ్, మేము అలాగే ఆలోచన చేసి ఉంటే వైఎస్ఆర్ సిపి నాయకులు లక్షాదికారలు అయ్యే వారు.సంక్షేమం టిడిపి సానుభూతి పరులకే అధికంగా జరిగిందని రికార్డులు చెబుతున్నాయి.

 

Tags:MLA Srikanth Reddy who is campaigning for YSRCP elections.

Post Midle