బడిపంతులుగా మారిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
రామడుగు ముచ్చట్లు:
రామడుగు మండలం గోపాలరావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గురువారం రోజున ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లో బయోమెట్రిక్ తొందరగా ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే 10వ తరగతి విద్యార్థులను కలిసి క్లాస్ రూమ్ లో పాఠాలు బోధించారు. పదవ తరగతి విద్యార్థులకు త్వరలో పరీక్ష సమయం కూడా దగ్గర పడుతుందని గుర్తు చేశారు. చాలా జాగ్రత్తగా చదవాలి అవసరమైతే పిల్లలకు నైట్ క్లాసులు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదే సమయంలో పదవ తరగతి విద్యార్థి లేటుగా రావడంతో ఎమ్మెల్యే విద్యార్థి తల్లి తండ్రికి ఫోన్ చేసి మీ అబ్బాయి ఎందుకు లేటు అయిందని అడగగా రేపటి నుండి తప్పకుండా టైం కి వస్తాడని అన్నాడు. పరీక్షల సమయంలో దగ్గర పడుతుంది మీ అబ్బాయికి సైకిల్ కొనివ్వండి అని ఎమ్మెల్యే రవిశంకర్ సూచించారు. అనంతరం ఆబ్సెంట్ ఉన్న విద్యార్థుల లిస్టు తెప్పించుకొని వారి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లల్ని తప్పకుండా స్కూలుకు పంపాలి అని సూచించారు. పిల్లలు ఇష్టపడి చదవాలి అప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతారు అన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ ముందస్తు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామడుగు మండల టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ఎంపిటిసిలు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Tags: MLA Sunke Ravi Shankar who became a student

