Natyam ad

వైకాపా నుంచి ఎమ్మెల్యే సస్పెండ్

-జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు
-తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ టికెట్ కేటాయించే అవకాశం

 

చిత్తూరు ముచ్చట్లు:

 

Post Midle

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ దఫా ఎన్నికల్లో శ్రీనివాసులుకు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా టికెట్ నిరాకరించడం, రాజ్యసభ సీటు కేటాయిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు తన ఇద్దరు కుమారులు, తన అనుచరుడు వినాయక బాలాజీతో కలిసి ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ కు పుష్పగుచ్చం అందజేసి తాజా రాజకీయ పరిణామాలపై కాసేపు చర్చించారు. ఈ నేపథ్యంలో రాజకీయ పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయిస్తే … ఆ సీటును బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరని శ్రీనివాసులుకు ఇస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు సమాచారం ఇదిలా ఉండగా పార్టీ నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ జనసేన పార్టీ అధినేతను కలిసిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి.

 

Tags: MLA suspended from Vaikapa

Post Midle