సమిశ్రగూడెంలో ఎమ్మెల్యే పర్యటన

Date:28/10/2020

నిడదవోలు  ముచ్చట్లు:

సమిశ్రగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను నిడదవోలు మాజీ శాసనసభ్యుడు బూరుగుపల్లి శేషారావు  పరామర్శించారు. సమిశ్రగూడెం గ్రామానికి చెందిన బొడ్డు బ్రహ్మానందం,  ఆయన సోదరుడు మోహన్రావులు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందినారు. అందువలన మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు గారు ఈరోజు అనగా బుధవారం ఉదయం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చినారు, గ్రామానికి చెందిన మహ్మద్ ఖాజా (లారీ డ్రైవర్) ఈయన కూడా అనారోగ్య కారణాల రీత్యా ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా శేషారావు గారు పరామర్శించి  ఓదార్చినారు. అలాగే  సమిశ్రగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ దపర్తి ప్రభాకర రావు కూడా ఇటీవల అనారోగ్య కారణాలతో మృతిచెందడంతో ఆయన తండ్రి దాపర్తి తాతారావు,  , ఆయన సోదరులు,  ప్రభాకర రావు భార్య పిల్లలను కలిసి పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు  ప్రజలకు అందించిన వైద్య సేవలను జ్ఞాపకం చేసుకుని  కొనియాడారు, గ్రామానికి చెందిన బొండాడ వెంకటరమణ  భార్య కూడా ఇటీవల కాలంలో మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను కూడా కలిసి ఓదార్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు  గోగిన శ్రీనివాసరావు(లాలి), డి వి శ్రీనివాసరావు, గజ్జరపు శ్రీనివాస్, దాపర్తి కుమార్ ర్, మద్దుకూరి శ్రీనివాస్, బుగ్గే శివ, ముప్పిడి పండు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూర్ లో ఆపరేషన్ ముస్కాన్

Tags: MLA tour in Samishragudem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *