MLA who distributed food parcels to the poor

పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Date:27/03/2020

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం అన్నం పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూ ఎక్కడో చైనా కేంద్రంగా ఆవృత మై, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్ నియంత్రణ కై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న లాక్ డౌన్ కార్యక్రమం అభినందనీయమన్నారు. ఈ క్రమంలో రోజువారీ కూలీలు,  వీధుల వెంబడి తిరుగుతూ జీవనం గడుపుతున్న బిక్షాటకులు, ఆర్ధిక స్థితి గతులు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నవారికి మనసున్న దాతలు తమ వంతు చేయూతనివ్వాలి అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేశారు.

పోలీసులకు, కార్మికులకు భోజనం పంపిణీ 

Tags: MLA who distributed food parcels to the poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *