కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Date:29/10/2020

రావులపాలెం  ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి  ప్రారంభించిన వై.యస్.ఆర్.కంటి వెలుగు పధకంలో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు అందచెయ్యడం జరుగుతుంది. ఈ పధకంలో భాగంగా రావులపాలెం మండలం ఉబలంక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 257 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు శాసనసభ్యుడు, చిర్ల జగ్గిరెడ్డి  చేతుల మీదుగా చిన్నం వారి పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అందచేసారు.
ఈ సందర్భంగా కోవిడ్-19 పై పోరాటంలో ప్రాణాలకు తెగించి ఉత్తమ సేవలందించిన ఉబలంక డాక్టర్ దుర్గాప్రసాద్ ను  శాసనసభ్యుడు దుశ్శాలువాతో సన్మానించారు.

వికారాబాద్లో కలకలం…మహిళ గొంతుకోసి దారుణ హత్య

Tags: MLA who distributed the glasses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *