కోవిడ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Date:13/08/2020

పిఠాపురం ముచ్చట్లు:

పిఠాపురం నియోజకవర్గంలో కరోనా వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని,వైరస్ సోకినవారెవరూ అధైర్యపడొద్దని,ఏ అవసరమొచ్చినా తాను అండగా ఉంటానని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు భరోసా ఇచ్చారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కోవిడ్ సెంటరును ఆయన  ప్రారంభించారు.కోవిడ్ సెంటర్లో ఏర్పాట్లను ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు.దీంతోపాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు,సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ.,ఇక్కడ ఏర్పాటుచేసిన కోవిడ్ సెంటర్లో అన్ని సదుశహపాయాలు కల్పించామని,మరికొన్ని ఆక్సిజన్ సిలిండర్లను తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యాధికారి విజయశేఖర్,ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బొజ్జా దొరబాబు,బొజ్జా మాణిక్యాలరావు,బాలిపల్లి రాంబాబు,పచ్చిమాల అప్పలరాజు,పితాని కాశీవిశ్వనాథ్,ముదునూరి కొండబాబురాజు,ఖండవల్లి లోవరాజు,లలిత,గ్రంధి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

గంగాధర క్రాస్ రోడ్డు మరమ్మత్తు పనులకు 40 లక్షలు మంజూరు.

Tags:MLA who opened the Kovid Center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *