ఎమ్మెల్సీ అనంతబాబుకు అక్టోబర్‌ 7వరకు రిమాండ్‌

అమరావతి  ముచ్చట్లు:

తూర్పు గోదావరి జిల్లాలో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా ఉన్న కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి కోర్టు అక్టోబర్‌ 7వరకు రిమాండ్‌ను పొడిగించింది. బెయిల్‌ గడువు ముగియడంతో ఇవాళ ఎస్టీ, ఎస్సీ కోర్టులో విచారణ జరిగింది.  ఎమ్మెల్సీ వద్ద కొన్ని రోజుల పాటు డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం గత మే చివరివారంలో హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని నేరుగా ఇంటికి తీసుకొచ్చి వదిలేసి పారిపోయిన ఎమ్మెల్సీ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.చివరకు ఎమ్మెల్సీ స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి హత్యలో తానే ప్రధాన సూత్రదారినని లొంగిపోయాడు. అతడిపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు కేసు నమోదు చేసి సెంట్రల్‌ జైలుకు పంపారు. అప్పటి నుంచి బెయిల్‌ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించింది . ఇటీవల ఎమ్మెల్సీ తల్లి మృతి చెందడంతో 14 రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

 

Tags: MLC Anantha Babu remanded till October 7

Leave A Reply

Your email address will not be published.