Natyam ad

ఎమ్మెల్యే ప్రసన్నను కలిసిన  ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డి

కోవూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గ శాసన సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని తూర్పు రాయలసీమ వైకాపా ఎంఎల్సి అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వక కలిశారు. “గడపగడపకి మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా బుచ్చి మండలం కాగులపాడు గ్రామంలో పర్యటిస్తున్న కోవూరు శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని శ్యాం ప్రసాద్ రెడ్డి కలిసి, పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంపై చర్చించారు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తనకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర జిల్లా వైకాపా నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు .ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చి మున్సిపాలిటీ, మిగతా మండలాల నాయకులు గత నెల రోజుల నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో పనిచేసి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారని, మిగిలిన ఓటర్లను త్వరగా నమోదు చేయించి, రాబోయే పట్టబధ్రుల ఎన్నికల్లో మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తామని శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే  తెలిపారు.

 

Tags: MLC candidate Shyam Prasad Reddy met MLA Prasanna

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.