పుంగనూరులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలు ముమ్మరం
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు పలు ప్రాంతాలలో ప్రచారాలు ముమ్మరం చేశారు. మండలంలోని కుమ్మరగుంట, కొండమదొడ్డి గ్రామాల్లో వైఎస్సార్‌సీసీ జిల్లా కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ మునస్వామి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. అలాగే మంగళం గ్రామ పంచాయతీలో నాయకులు రాజారెడ్డి, రాంమోహన్‌రెడ్డి ల ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే మున్సిపాలిటిలోని ప్యాలెస్ కాంపౌండు, దోబీకాలనీ, కొత్తపేట ప్రాంతాలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు ఆదిలక్ష్మీ, మమత, మాజీ కౌన్సిలర్ శోభరాణి ప్రచారం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి ఓటు వేయాలని కోరారు. ఈకార్యక్రమాలలో నారాయణరెడ్డి, శంకరప్ప, పెద్దరెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags; MLC election campaigns are in full swing in Punganur
