Natyam ad

ఎమ్మెల్సీ కవిత పరువ నష్టం కేసు

ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్ట్


హైదరాబాద్ ముచ్చట్లు:


బిజేపి ఎంపీ పర్వేశ్ వర్మ,మాజీ ఎమ్మెల్యే ముజంధర్ సిర్సాలకు సిటీ సివిల్ కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఎవరు వాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. సోషల్ మీడియా, మీడియా ముందు   ఎలాంటి  వాఖ్యలు చేయకూడదుకోర్టు విచారణను సెప్టెంబర్ 13 కు  వాయిదా వేసింది. కవిత తరఫు న్యాయవాది మోహిత్ రెడ్డి  వాదనలు వినిపిస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్  విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ వాదనలు వినిపించారు.
ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని పిటిషన్ లో కవిత పేర్కొన్నారు.

 

 

Post Midle



ప్రజల్లో తనకున్న ప్రతిష్టను భంగం కలిగించేందుకు ఆక్రమ పద్ధతు లను ఎంచుకున్నారని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తులు జాతీయ పార్టీ సభ్యులు కావడం తోనే మీడియా లో కథనాలు వచ్చాయని కవిత తరుపు న్యాయవాది  వాదించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన ద్వారా 4.5 కోట్లు మనీష్ సిసోడియా కు ఇచ్చినట్లు ఆరోపణలు చేశారు. బాధ్యత యుతమైన పదవిలో ఉన్నవారు ఆధారాలతో ఆరోపణలు చేయాలి, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు. పలు మీడియా లో వచ్చిన వరుస కథనాలను  కవిత తరుపు న్యాయవాది కోర్టుకు అందజేసారు. ఆగస్టు 21 తేదీన మీడియా సమావేశం లో బీజేపీ నేతలు మాట్లాడిన వీడియో లను కోర్ట్ ముందు ప్రస్తావించారు. ప్రతివాదులు తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని  కోరారు.

 

Tags: MLC Kavitha defamation case

Post Midle

Leave A Reply

Your email address will not be published.