మర్రికి ఎమ్మెల్సీ పదవి…రజనీకి చెక్

Date:14/07/2020

గుంటూరు ముచ్చట్లు:

తొలిసారి ఎమ్మెల్యే అయినా ఆమె రాజకీయాలను ఒడిసి పట్టారు. ప్రత్యర్థి పార్టీ నేతతో పాటు సొంత పార్టీ నేతలను కూడా కట్టడి చేయడంలో ముందున్నారు. చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ సుదీర్ఘకాలం చిలకలూరి పేటను ఏలాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకున్న కుల బలంతో పాటు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. తనపై కేసులు వచ్చి పడతాయామోనన్న ఆందోళనతో ప్రత్తిపాటి పుల్లారావు పేట రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.ఎప్పటికైనా శత్రువేనంటూ….ఇక వైసీపీలోనే ఉన్న మర్రి రాజశేఖర్ ఎప్పటికైనా తనకు శత్రువుగా భావించిన విడదల రజనీ ఆయనను తొక్కిపట్టేందుకు తొలి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. త్వరలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. గవర్నర్ కోటాలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పదవిలో ఒకటి మర్రి రాజశేఖర్ కు ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కూడా హామీ ఇచ్చారంటూ మర్రి వర్గం ప్రచారం చేసుకుంటుంది.నిజానికి మర్రి రాజశేఖర్ కమ్మ సామాజికవర్గం అయినా పార్టీని నమ్ముకుని ఉన్నారు. గత ఎన్నికల్లో సీటు దక్కకపోయినా పార్టీ విజయానికి సహకరించారు. దీంతో ఆయనకు గ్యారంటీ ఎమ్మెల్సీ పదవి అన్న ప్రచారంతో ఎమ్మెల్యే విడదల రజనీ అలెర్ట్ అయ్యారంటున్నారు.

 

 

 

మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి వస్తే తనకు భవిష్యత్తులో చెక్ తప్పదని భావించి ఆమె మర్రి రాజశేఖర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.దీంతో చిలకలూరిపేట రాజకీయాలు వేడెక్కాయంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరుగుతుండటంతో విడదల రజనీకి అవకాశం ఉందంటూ ఆమె వర్గం ప్రచారం చేసుకుంటుంది. మర్రి రాజశేఖర్ కు పార్టీ హైకమాండ్ నుంచి ప్రామిస్ గట్టిగా అందడంతో ఆయన సైలెంట్ గా ఉన్నారంటున్నారు. మర్రికి ఎమ్మెల్సీ పదవి దక్కితే చిలకలూరిపేటలో విడదల రజనీ రాజకీయానికి చెక్ పడే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం మీద పేట రాజకీయాలు రానున్న కాలంలో మరింత వేడెక్కే అవకాశాలున్నాయంటున్నారు.

కరోనాతో నిలిచిపోయిన ఈ పాస్ బుక్స్..

Tags:MLC post for Marri … Check for Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *