పుంగనూరు పల్లెబాటలో మంత్రి పెద్దిరెడ్డి తో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
పులిచెర్ల ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కొమ్మిరెడ్డి గారి పల్లి, మంగళంపేట, కొత్తపేట గ్రామాలలో ప్రజా సమస్యలపై మరియు జగనన్న చేపట్టిన పథకాల ను అవగాహన కల్పించే ఈ ప్రక్రియలో భాగంగా పల్లె బాటలో భాగంగా ఇంటింటికి తిరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొనడం జరిగింది, అంతకుమునుపు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుశ్శాలువతో సత్కరించి, ఆప్యాయంగా ఆహ్వానించడం జరిగింది. పల్లె బాట అనంతరం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించడం జరిగింది.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాల్గొన్నవారిలో ప్రొద్దుటూరు ఐదో వార్డ్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి , 11వ వార్డు వైఎస్ఆర్సిపి నాయకులు దుగ్గి రెడ్డి రఘునాథ రెడ్డి , రాగం శ్రీధర్ పాల్గొనడం జరిగింది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: MLC Ramesh Yadav with Peddireddy Ramachandrareddy in the countryside