అసభ్య వాయిస్ మెసేజ్ లు పెట్టిన ఎమ్మార్వో ఆఫీస్ అటెండర్

అదిలాబాద్ ముచ్చట్లు;

ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. తహశీల్దార్ కార్యాలయం అటెండర్‌ పై మహిళలు దాడి చేశారు. కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాడిని వచ్చిన మహిళలే టార్గెట్‌ చేశాడు. అటెండర్‌. అంతేకాకుండా వారి వద్ద నుంచి ఫోన్‌ నెంబర్లు తీసుకుని తహశీల్దార్‌ వచ్చేది లేనిది మిగతా విషయాల గురించి కాల్‌ చేసి సమచారం అందిస్తానంటూ నమ్మించేవాడు. దీంతో మహిళలు అటెండర్‌ మాయ మాటలను నమ్మి అతనికి నెంబర్‌ ఇచ్చేవారు. ఇదే అలుసుగా భావించిన అటెండర్‌ మహిళలకు అసభ్య పదజాలంతో వాయిస్‌ మెసేజ్‌ లు పంపేవాడు. ముందుగా మహిళలు లైట్‌ తీసుకున్నారు. దాని గురించి పట్టించుకోలేదు. కానీ.. రాను రాను అటెండర్‌ ఇంకా రెచ్చిపోయాడు అసభ్య కరమైన వాయిస్‌ తో ఓ మహిళకు మెసేజ్‌ పంపాడు. ఫోన్‌ కు మెసేజ్‌ రాగానే అది చూసిన మహిళ ఆ మెసేజ్‌ ను వినింది. దీంతో అమె ఆగ్రహానికి గురైంది. ఫోన్‌ నెంబర్‌ తీసుకుని ఇంత అసభ్య పదజాలంతో తనకు అటెండర్‌ వాయిస్‌ మెసేజ్‌ పంపాడంటూ తన తోటి మహిళలకు చెప్పింది.దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన మహిళలు తహశీల్దార్‌ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. అక్కడే వున్న అటెండర్‌ వద్దకు వెళ్లి అసభ్య మెసేజ్‌ గురించి ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన అటెండర్‌ ముందు వారి మాటలకు రెచ్చిపోయి నాకు ఏమీ తెలియదంటూ చేతులు దులుపుకున్నాడు. మహిళలకు అటెండర్‌ పై ఒక్కసారిగా దాడికి దిగారు. సమాచారం ఇస్తానంటూ ఇలాంటి వాయిస్ మెసేజ్‌ లు పంపిస్తావా అంటూ చెప్పుతో కొట్టుకుంటూ అటెండర్‌ ను బయటకు లాక్కుంటూ వచ్చారు. అయితే అక్కడే వున్న అధికారులు కొందరు పోలీసులకు సమచారం ఇచ్చారు. హుటా హుటిన చేరుకున్న పోలీసులు అటెంర్‌ ను కొడుతున్న మహిళలను అడ్డుకున్నారు. దీంతో ఇంకా రెచ్చిపోయిన మహిళలు చెప్పుతో దాడిచేయడం అస్సలు ఆపలేదు. అసభ్య కరమైన వాయిస్‌ మెసేజ్‌ పంపాడంటూ మహిళలకు సహకరించాల్సిన పోలీసులు అటెండర్‌ కు సపోర్ట్‌ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మహిళలను శాంతింప జేసి అటెండర్ ను స్టేషన్ కు తరలించారు. అటెండర్‌ పై కేసు నమోదు చేశారు.

Tags:Mro office attendant who left obscene voice messages

Post Midle
Post Midle