పుంగనూరు ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు -డిసిహెచ్ఎస్ బిసికె నాయక్
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిసిహెచ్ఎస్ బిసికె.నాయక్ తెలిపారు. శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులు ధనుంజయరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ డాక్టర్ శరణ్, మెడికల్ ఆఫీసర్ యశ్వంత్ తో కలసి ప్రభుత్వాసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. అలాగే ఆసుపత్రి ఆవరణంలో నిర్మిస్తున్న మదర్ అండ్ చైల్డ్ కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బంది క్వార్టర్స్‌ను పరిశీలించారు. రోగులను విచారించారు. డిసిహెచ్ఎస్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు. అలాగే తల్లిబిడ్డ సంరక్షణ కేంద్రాన్ని సత్వరమే పూర్తి చేసి, అందులో అధునాతన యంత్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపుతామన్నారు. సిబ్బంది క్వార్టర్స్‌ను మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో సిబ్బంది పనిచేసేలా ప్రతి రోజు మూడు సార్లు బయోమెట్రిక్ వేసే కార్యక్రమం జరుగుతోందన్నారు. డాక్టర్లు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటు వైద్యసేవలు అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు , సిబ్బంది పాల్గొన్నారు.

Tags; Modern Medical Services at Punganur Hospital – DCHS BCK Naik
