Natyam ad

మోడరన్ మీరాబాయి…

లక్నో ముచ్చట్లు:

శ్రీకృష్ణుడు అంటే కోట్లాది మందికి ఎంతో భక్తి ఉంటుంది. ఆయనను నిత్యం చాలా మంది ఇష్టంగా ఆరాధిస్తుంటారు. అయితే ఓ అమ్మాయి మాత్రం ఆ శ్రీకృష్ణుడినే ప్రాణంగా ప్రేమిస్తున్నారు. అమితంగా ఇష్టపడుతున్నారు. అందుకే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకున్నారు. మథురలోని బృందావన్లో కృష్ణుడిని ఆ అమ్మాయి మనువాడారు.ఉత్తర ప్రదేశ్‍లోని ఔరైయా  జిల్లాకు చెందిన ఎల్‍ఎల్‍బీ స్టూడెంట్ రక్ష సొలాంకి .. శ్రీ కృష్ణ భగవానుడి విగ్రహాన్ని వివాహం చేసుకున్నారు. శాస్త్రోక్తంగా పెళ్లి మండపంలో ఈ పెళ్లి జరిగింది. కృష్ణుడి విగ్రహాన్ని చేతిలో పట్టుకొని ఆమె అగ్నిగుండం చుట్టూ ఏడు అడుగులు వేశారు. ఈ పెళ్లి వేడుకను సొలాంకి కుటుంబం ఘనంగా జరిపించింది. వధువు దుస్తుల్లో కృష్ణుడి విగ్రహాన్ని చేతుల్లో పట్టుకొని మురిసిపోయారు రక్ష రక్ష సొలాంకి.. ఔరయా జిల్లాలోని బిదున పట్టణానికి చెందినవారు. ఆమె ఎల్ఎల్‍బీ చదువుతున్నారు. జూలై 2022లో మథురలోని బృందావనానికి ఆలయ దర్శనం కోసం వచ్చారు. తన తండ్రి రంజిత్ సింగ్ సొలాంకితో కలిసి ఆమె వచ్చారు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడే తన భర్త అని రక్ష సొలాంకి నమ్ముతున్నారు.

 

 

 

శ్రీ కృష్ణుడిపై ఉన్న అమితమైన ప్రేమ అప్పటి నుంచి మరింత పెరిగింది. రక్ష సొలాంకి తండ్రి రంజిత్‍ సింగ్.. కాలేజీ పిన్సిపాల్‍గా రిటైర్ అయ్యారు. శ్రీకృష్ణుడు తన మెడలో పూలమాల వేస్తున్నట్టు రక్షకు ఎప్పటి నుంచో కల వస్తోందని, అప్పటి నుంచే ఆమెకు కృష్ణుడు అంటే ఇష్టం పెరిగిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుందని రంజిత్ తెలిపారు. అందుకే కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలన్న తన కూతురి ఇష్టాన్ని కాదనలేదని చెప్పారు. ఈనెల 16వ తేదీన కృష్ణుడి విగ్రహాన్ని రక్ష సొలాంకి వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు బంధువులతో కలిసి వచ్చి పెళ్లిని ఘనంగా జరిపారు రంజిత్ సింగ్.కుటుంబ సభ్యులందరి అంగీకారంతోనే శ్రీకృష్ణుడితో రక్ష వివాహం జరిగిందని ఆమె సోదరి అనూరాధ తెలిపారు. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ హాజరయ్యారని తెలిపారు. ఇప్పుడు దేవుడు కూడా మా బంధువయ్యాడని ఆమె అన్నారు.

 

Post Midle

Tags; Modern Mirabai…

Post Midle