పోతురాజు కాలువ ఆధునికరణ

Date:20/07/2019

ఒంగోలు ముచ్చట్లు :

పోతురాజు కాలువను ఆధునికరించి త్రాగునీటి కొరత లేకుండా చూడాలని విద్యుత్, అటవీ శాఖ మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి  అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రి నివాసంలో ఇరిగేషన్, మున్సిపల్ కార్పోరేషన్ అధికారులతో సమావేశమై పోతురాజు కాలువను  ఆధునికరించడానికి నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ యాదవ్ తో మాట్లాడి ఒంగోలు పట్టణం, అలాగే చుట్లుప్రక్కల ప్రాంత ప్రజలకు త్రాగునీటి కొరత తీర్చేందుకు 90.09 కోట్లు నిధులు మంజూరు చేయించినట్లు  మంత్రి  తెలిపారు.

 

 

 

ఈ  కాలువ ఆధునీకరణలో భాగంగా నిర్వాసితులకు  ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను  ఆదేశించారు. పోతురాజు కాలువ ఆధునీకరణవల్ల నగరపాలక సంస్ధకు ఎంతో  ఉపయోగకరంగా ఉంటుందని, వర్షాలు  కురిసే సమయంలోను లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు.

 

 

 

 

ఈ సమావేశంలో నీటిపారుదల ఎస్.ఇ.వీర్రాజు, నగరపాలక సంస్థ కమీషనర్ నిరంజన్ రెడ్డి, నగరపాలక సంస్థిఇంజనీర్ సుందరరామిరెడ్డి తదితర  అధికారులు పాల్గొన్నారు.

 

ప్రభుత్వ ఇళ్ల కోసం ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు: కేటీఆర్‌

Tags: Modernization of the Poturaju Canal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *