కేసీఆర్ ను సంతృప్తి పరిచేందుకు మోడీ ముందస్తు ఎన్నికలకు అనుమతి

Modi allowed early elections to satisfy KCR

– కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి చిన్నా రెడ్డి

 

Date:20/06/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

జమిలీ ఎన్నికలు .. ఒకే దేశం .. ఒకే ఎన్నిక అనే నినాదం చెబుతున్న మోడీ .. తెలంగాణలో ఎందుకు ముందస్తు ఎన్నికలకు అవకాశం ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి చిన్నా రెడ్డి డిమాండ్ చేసారు.గురువారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కేసీఆర్ ను సంతృప్తి పరిచేందుకు మోడీ ముందస్తు ఎన్నికలకు అనుమతి ఇచ్చారన్నారు.మీరు చేసిన తప్పును వేలకోట్ల అదనపు భారం పడిందన్నారు.ఇప్పుడు మోడీ జమిలీ ఎన్నికలు అంటే ఎవరు నమ్ముతారన్నారు.కొత్త సచివాలయం బైసన్ పోలో గ్రౌండ్ లో కడతానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఉన్న చోటనే కడతానంటున్నాడని ప్రశ్నించారు.బీజేపీ తో సైక్యత లేదుకాబట్టే మళ్ళీ పాత స్థానంలోనే కడతానంటున్నాడని,కొత్త అసెంబ్లీ .. కొత్త సచివాలయం కట్టాలనుకోవడం పనిలేని మంగలి పిల్లి తల కొరిగినట్లు ఉందని చిన్న రెడ్డి ఏద్దేవా చేసారు.కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలపై వేలకోట్ల అదనపు భారం పడుతుందన్నారు.కాళేశ్వరం పూర్తికాకున్నా .. ప్రారంభోత్సవమంటూ కేసీఆర్ హడావిడి చేస్తున్నాడు.

 

 

 

 

 

గతంలో కాళేశ్వరం కోసం రాత్రి .. పగలు కష్టపడిన హరీష్ రావు ను పిలుస్తున్నారా లేదా చెప్పాలన్నారు.కాళేశ్వరం కోసం హరీష్ ఎంతో చిత్తశుద్ధుతో కష్టపడ్డాడు .. ఇప్పుడు కేసీఆర్,కేటీఆర్ లు అంతా తామే చేశామన్నట్లు కలరింగ్ ఇస్తున్నారని దుయ్యబట్టారు.ఉద్యోగులకు ఐఆర్ పైనా .. పిఆర్సీ పైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు.ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డ్స్ నాలుక తీసుకోవడానికి కూడా పనికి రావడం లేదన్నారు.జడ్పి ఉద్యోగుల జీపీ ఫండ్ ఆరువందల కోట్లను ప్రభుత్వం వాడుకోవడం దారుణమన్నారు.ఆర్టీసీ కార్మికుల కష్టాలు కేసీఆర్ కు పట్టడం లేదని, పాలమూరు ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు కూడా మల్లన్న సాగర్ కింద ఇచ్చిన ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని చిన్న రెడ్డి డిమాండ్ చేసారు.

 

భారత్ కు ప్రపంచ గుర్తింపు వచ్చింది

Tags: Modi allowed early elections to satisfy KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *