రాఫెల్ పేరుతో మోదీ, అనిల్ అంబానీలు రక్షణశాఖపై సర్జికల్ దాడులు

Modi and Anil Ambani under the name of Rafael Surgical Attack on the Defense Ministry
Date:22/09/2018
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాఫెల్ పేరుతో మోదీ, అనిల్ అంబానీలు రక్షణశాఖపై సర్జికల్ దాడులు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాఫెల్ ఒప్పందం విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సోవో హోలెన్ సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం మరోసారి రాహుల్ ట్విటర్ ద్వారా స్పందించారు.
ప్రధాని, అనిల్ అంబానీ సంయుక్తంగా భారతీయ రక్షణ దళాలపై రూ.1.3లక్షల కోట్ల మేర సర్జికల్ దాడులు చేశారు. మోదీజీ మీరు అమరవీరుల రక్తాన్ని అగౌరవపరిచారు. ఇది సిగ్గుచేటు. మీరు భారతదేశాన్ని మోసగించారు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
రాఫెల్ ఒప్పందంలో జరిగిన భారీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమ పదవులకు రాజీనామా చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.రాఫెల్ విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వమే డసో ఏవియేషన్ సంస్థకు సూచించిందని హోలన్ చెప్పినట్లు ఫ్రెంచి పత్రిక మీడియా పార్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే.
దీని కారణంగా దేశంలో రాజకీయ దుమారం రేగింది. హోలన్ వ్యాఖ్యలపై రాహుల్ వెంటనే స్పందించారు. ‘ప్రధాని స్వయంగా రహస్య పద్ధతుల్లో సంప్రదింపులు జరిపి ఒప్పందాన్ని మార్చారు. హోలెన్ పుణ్యమా అని మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం’ అంటూ రాహుల్ గత రాత్రి మోదీపై విమర్శలు చేశారు.
Tags:Modi and Anil Ambani under the name of Rafael Surgical Attack on the Defense Ministry