Natyam ad

మోడీ గో బ్యాక్ అంటూ నిరసన

కాకినాడ ముచ్చట్లు:


విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్న నరేంద్ర మోడీకి విశాఖ పర్యటన చేసే హక్కు లేదని, గో బ్యాక్ మోడీ నిరసన చేశారు. కాకినాడ ఇంద్రపాలెం లాకులు అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సిపిఐ, లిబరేషన్ తదితర వామపక్ష పార్టీలు శనివారం నిరసన ధర్నా చేపట్టారు.   ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిన నరేంద్ర మోడీని బలపరుస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చిన నరేంద్ర మోడీ పాసిపోయిన లడ్డులు ఇచ్చారని విమర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ పాసిపోయిన లడ్డులు కోసం నిన్న మోడీని కలిసారా? అని ఎద్దేవా చేశారు. వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఆంధ్రకు మోడీ చేసిన ద్రోహాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు. ఈ పార్టీలు మోడీతో కుమ్మక్కయ్యాయని విమర్శించారు.

 

 

 

సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2014 తిరుపతిలో ఎన్నికల ఎన్నికల బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తానని చెప్పిన మోడీ ఆ హామీని అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకొని విశాఖ వస్తున్నారని ప్రశ్నించారు. 64 గ్రామాలు ఖాళీ చేసి, 26వేల ఎకరాల భూములు ఇచ్చి, 64 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి, 32 మంది తమ ప్రాణాలను అర్పించి, త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసే హక్కు మోడీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించాలని, విశాఖ రైల్వే జోన్ మంజూరు చేయాలని, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని, రాయలసీమకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని, కడప ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు చేయాలని విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అందుకోసం ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.

 

 

 

Post Midle

దళిత ఉద్యమ నేత అయితాబత్తుల రామేశ్వరావు మాట్లాడుతూ మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలపై పన్నుల భారం, ధరల భారం భారీగా పెరిగిందన్నారు. నిరుద్యోగం పేదరికం అసమానతలు అంతులేకుండా పెరిగాయని, రాజ్యాంగానికి తూట్లు పొడు పొడుస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పౌర హక్కులను హరిస్తూ, ప్రజల కోసం మాట్లాడే వారిని జైల్లో పెడుతున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేకి మోడీ గో బ్యాక్ అంటూ వారు నినదించారు.
ఈ కార్యక్రమంలో కే వీరబాబు, మలకల వెంకటరమణ, పి వీరబాబు, జ్యోతి, పి బసవయ్య, బంగారు సత్యనారాయణ, సాదే సతీష్, మేడిశెట్టి వెంకటరమణ, రాజా, గంగ బాబు, సూర్యనారాయణ, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Modi go back protest

Post Midle

Leave A Reply

Your email address will not be published.