మోడీ కోసం ఆస్ట్రేలియాలో ఉద్యోగం మానేశాడు

Date:15/04/2019
బెంగళూర్  ముచ్చట్లు :
ప్రధాని నరేంద్ర మోదీ అంటే అపారమైన నమ్మకం. ఓటు హక్కుపై గౌరవం. దేశాన్ని ముందుకు నడిపించాలంటే మోదీ లాంటి నేత మరోసారి ప్రధాని కావాలని పరితపిస్తున్నాడు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసేందుకు తన సెలవును పొడిగించుకోవాలనుకున్నాడు. అందుకు వీలు కాలేదని ఆస్ట్రేలియాలో తన జాబ్‌కు రాజీనామా చేశాడు. మోదీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతం సూరత్కల్‌కి చెందిన సుధీంద్ర హెబ్బర్‌. సుధీంద్ర హెబ్బర్‌ (41) ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో ఏడాదిన్నర నుండి స్క్రీనింగ్‌ అధికారిగా పనిచేస్తున్నాడు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని నిశ్చయించుకుని సెలవులపై ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఈ నెల 5 నుంచి 12 వరకు సెలవులు దొరికాయి. దక్షిణ కన్నడ నియోజకవర్గంలో ఈనెల 18న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. సెలవును పొడిగించాలని కోరగా అధికారులు నిరాకరించారు. కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, మోదీని మరోసారి ప్రధానిగా చూడాలని ఆశించిన హెబ్బర్ మరో ఆలోచన లేకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. దీనిపై సుధీంద్ర హెబ్బర్ మీడియాతో మాట్లాడారు. ‘సిడ్నీలో యూరోప్ ప్రజలు, పాకిస్థానీయులు సహా నేను ఎన్నో దేశాల ప్రజలకు సేవలు అందించాను. దేశాన్ని కాపాడేందుకు ఎలాగు బార్డర్ (సరిహద్దులు)కు వెళ్లి పోరాటం చేయలేను. కనీసం ఓటు వేసి నా ప్రాథమిక కర్తవ్యాన్ని నిర్వహించాలనుకున్నాను. ఆస్ట్రేలియాలో పర్మినెంట్ రెసిడెంట్ కార్డు ఉంది. నా భార్య ఫిజీ-ఆస్ట్రేలియన్. ఎయిర్ పోర్టులో జాబ్‌కు ముందు సిడ్నీ రైల్వేలో ఉద్యోగం చేశాను. ఇప్పుడు మరో ఉద్యోగాన్ని వెతుక్కోవడం నాకు పెద్ద సమస్య కానే కాదంటూ’ తన అభిప్రాయాల్ని వెల్లడించాడు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సుధీంద్ర తొలిసారి ఆస్ట్రేలియాకు వెళ్లే సమయంలో 2014, ఏప్రిల్ 17న కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. హోసబెట్టులో ఉదయం దాదాపు 7 గంటల సమయంలో ఓటువేసి, అనంతరం తొమ్మి గంటలు జర్నీచేసి బెంగళూరు చేరుకున్నాడు. అదే రోజు రాత్రి బెంగళూరు నుంచి సిడ్నీకి వెళ్లిపోయాడు.
Tags:Modi has resigned from Australia for employment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *