ప్రపంచంలో నెంబర్ వన్ మోడీనే

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ లీడర్‌గా నిలిచారు. ప్రపంచ నేతల్లో మోదీ చరిష్మా ఇంకా కొనసాగుతూనే ఉందని.. డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మోర్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. 71 శాతం మంది సానుకూలంగానూ, 21 శాతం మంది వ్యతిరేకంగానూ స్పందించడంతో ఆయనకు నెట్ అప్రూవల్ రేటింగ్ 50 శాతానికి పైగా ఉందని పేర్కొంది. అయితే.. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు అతి తక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు తెలిపింది. ఆయన్ను చాలామంది నాయకుడిగా అభివర్ణించడం లేదని పేర్కొంది. కాగా.. ప్రపంచ నేతలకు సంబంధించిన ప్రజాదరణను మోర్నింగ్ కన్సల్ట్ పరిశీలిస్తుంది. మోర్నింగ్ కన్సల్ట్ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రదాని మోదీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మోదీ అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి.అయితే.. ఈ మోర్నింగ్ కన్సల్ట్ ప్రపంచంలోని పలు దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేస్తోంది. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రజాదరణ దారుణంగా తగ్గిపోయింది. ఆయన అప్రూవల్ రేటింగ్ మైనస్ 43 దగ్గర నిలిచిపోయింది. ఆయనను 69 శాతం మంది డిజప్రూవ్ చేశారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడో, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయీ-ఇన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌లకు నెట్ నెగెటివ్ అప్రూవల్ రేటింగ్స్ వచ్చాయి.ఏడు రోజులపాటు వయోజనులైన ప్రజల అభిప్రాయాన్ని పరిశీలించి ఈ రేటింగ్స్ ఇచ్చినట్లు మోర్నింగ్ కన్సల్ట్ ప్రకటనలో తెలిపింది. ఈ అధ్యయనంలో పలు దేశాలకు సంబంధించిన వారు పాల్గొన్నట్లు తెలిపింది.ప్రపంచ నాయకుల రేటింగ్‌ జాబితా: నరేంద్ర మోదీ: 71% ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్: 66% మారియో డ్రాగి: 60% ఫ్యూమియో కిషిడా: 48% ఓలాఫ్ స్కోల్జ్: 44% జో బిడెన్: 43% జస్టిన్ ట్రూడో: 43% స్కాట్ మోరిసన్: 41% పెడ్రో సాంచెజ్: 40% మూన్ జే-ఇన్: 38% జైర్ బోల్సోనారో: 37% ఇమ్మాన్యుయేల్ మాక్రాన్: 34% బోరిస్ జాన్సన్: 26%
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; Modi is number one in the world