మోడీ మరోసారి ప్రధాని అవ్వటం పగటి కలే

Modi is once again becoming Prime Minister

Modi is once again becoming Prime Minister

Date:10/01/2019
విజయవాడ ముచ్చట్లు:
ఈబీసీ బిల్లు రెండు సభలు ఆమోదించడం నాకు అశ్చర్యం కలిగించింది. నాలుగు సంవత్సరాలలో గుర్తుకు రాలేదా. ఇది ఎన్నికల ఎత్తు గడే. మోడీ మరోసారి ప్రధాని అవ్వటం పగటి కల అని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కే ఏ పాల్ అన్నారు. వైస్ జగన్ కానీ, చంద్రబాబు ను కానీ గెలిపిస్తే బీజేపీని గెలిపించి నట్టే. జగన్ ను జైళ్లో పెడతారేమో నని బీజేపీకి మద్దతు ఇస్తున్నారని అయన అరోపించారు. 99 శాతం హిందువులు సెక్యూలర్ వాదులు బీజేపికి 1 శాతం మాత్రమే రాష్ట్రంలో ఓటుబ్యాంకు. ప్రజాశాంతి పార్టీలో 60 వేల మంది యువతను చేర్పించండి. 1000 మంది ని చేర్పింనవారికి 3వేల భృతి ఇస్తా. 5 సంవత్సరాలలో విజయవాడను హైదరాబాద్ గా మార్చుతాను. 20 ఎంపీ సీట్లును గెలిపించండి. రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్లు మాకు అధికారం ఇస్తే డబుల్ చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. దోచుకునే వారికి ఓటు వేయ వద్దు. నాకు అవకాశం ఇవ్వండి. నా నోటితో చెప్పేవి నిజం అవుతాయీ. వైసీపీ, టీడీపీ భూస్థాపితం కావటం ఖాయం. కేసీఆర్ తో కలిసి గ్లోబల్ పీస్ సమ్మిట్ నిర్వహిస్తామని పాల్ అన్నారు. పార్టీలో  చేరిపించన వారికి గెలవకున్న భృతి ఇస్తాం. మోడీ 15 లక్షలు ప్రజల ఖాతాలలో వేస్తామని15 రూపాయలు కూడా వేయలేదు. మా అజెండా అభివృద్ధి మాత్రమే. అధికారం లోకి రాగానే 50 శాతం రైతులకు రుణమాఫీ చేస్తాం. చేనేత కార్మికులకు పూర్తి రుణమాఫీ చేస్తాం. గెలిచిన నియోజకవర్గానికి 100 కోట్లు కేటాయిస్తాం. అవినీతి అంతం చేసి రాష్ట్రంను అబివృద్ది చేయటమే నా ధ్యేయమని అన్నారు. ప్రజాశాంతి పార్టీ కమ్మ ,రెడ్డి కులాలకు వ్యతిరేకం కాదని అయన అన్నారు.
Tags:Modi is once again becoming Prime Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *