మంగళవారం తెలంగాణకు ప్రధాని మోడీ

Modi is the Prime Minister of Telangana on Tuesday

Modi is the Prime Minister of Telangana on Tuesday

Date:26/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ,  తెలంగాణకు రానున్నారు. మంగళవారం తెలంగాణలో పర్యటించనున్న భారత ప్రధాని నిజామాబాద్, మహబూబ్నగర్ లో నిర్వహించనున్న బహిరంగసభల్లో పాల్గొననున్నారు. మంగళవారం  ఉదయం మహారాష్ట్రలోని నాదేండ్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకోనున్న ప్రధాని,  మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ లో బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడ నుంచి మహబూబ్ నగర్ చేరుకొని మధ్యాహ్నం 2.30కి బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్ లో శంషాబాద్ చేరుకోనున్న ప్రధాని,  సాయంత్రం 4 గంటల తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. ప్రధాని సభలకు హాజరుకానుండడంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
Tags:Modi is the Prime Minister of Telangana on Tuesday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *