Natyam ad

రూ.22 వేల కోట్ల భారీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన

దిల్లీ ముచ్చట్లు:

విమానయాన రంగంలో స్వావలంబన దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వడోదరలో సీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు.దాదాపు రూ.22 వేల కోట్లతో టాటాల భాగస్వామ్యంతో ఎయిర్‌బస్‌ సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతోంది.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత రక్షణ ఏరోస్పేస్‌ రంగంలో ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి అని అన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టామని, దీనివల్లే తయారీ రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. విమానయాన రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ గుర్తింపు పొందిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న మూడు దేశాల్లో త్వరలో భారత్‌ చోటు సంపాదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

Post Midle

Tags: Modi laid the foundation stone for a huge project of Rs.22 thousand crores

Post Midle

Leave A Reply

Your email address will not be published.