బుందేల్ ఖండ్ వేను ప్రారంభించిన మోడీ
-8 నెలల్లో పూర్తయిన నిర్మాణం
లక్నో ముచ్చట్లు:
ఉచిత పథకాల హామీలు ఇచ్చి ఓట్లు సేకరించే సంస్కృతి దేశానికి చాలా ప్రమాదకరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్‌ను నిర్మిస్తోందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రారంభించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో శాంతిభద్రతలు మెరుగుపడడమే కాకుండా.. వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఇదంతా డబుల్ ఇంజిన్ సర్కారుతోనే సాధ్యం అని మోదీ స్పష్టం చేశారు.యూపీలో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రధాని ప్రారంభించారు.
రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ఉత్తర్‌ప్రదేశ్‌లోని 7 జిల్లాలను కలుపుతుంది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ వేను 6 లైన్లకు విస్తరించారు. ఈ రహదారి ద్వారా చిత్రకూట్ నుంచి దిల్లీకి ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో జలౌన్ జిల్లా ఒరాయ్ మండలం కైతేరీ గ్రామంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఈ ఎక్స్‌ప్రెస్ వేతో చిత్రకూట్ నుంచి ఢిల్లీకి ప్రయాణం దాదాపు 3 నుంచి 4 గంటలు తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా బుందేల్‌ఖండ్ పరుగులు పెడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు.ఉత్తరప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. దీనితో యూపీలో ఆరవ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వచ్చినట్లయింది. ఫిబ్రవరి 29, 2020న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. 28 నెలల్లోనే ఎక్స్‌ప్రెస్‌వే పనులు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించబడింది. ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని.. నగరాలలో ఉండే సౌకర్యాలు సామాన్య ప్రజానీకానికి సైతం
అందుబాటులోకి వస్తాయని పీఎంవో వెల్లడించింది కాగా ఈ ప్రతిష్ఠాత్మక రహదారి యూపీలోని ఏడు జిల్లాల మీదుగా వెళ్తుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ-టెండరింగ్‌ను ఎంచుకోవడం ద్వారా దాదాపు రూ.1,132 కోట్లు ఆదా చేసింది. కాగా 2020 ఫిబ్రవరి 29న బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు. కేవలం 28 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తైంది. 296 కి.మీ విస్తరించి ఉన్న ఈ ఎక్స్ ప్రెస్ వే షెడ్యూల్ కంటే ఎనిమిది నెలల ముందే పూర్తవడం గమనార్హం. ఈ ప్రతిష్టాత్మక ఎక్స్‌ప్రెస్ వే చిత్రకూట్, బండా, మహోబా, హమీర్పూర్, జలౌన్, ఔరైయా, ఇటావా జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కప్, ఆగ్రా- ఇటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది. దీనిని లక్నోఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానంగా నిర్మించారు.గత ప్రభుత్వాలు మోసం చేశాయి..ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో ప్రసంగించిన మోడీ.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అభివృద్ధి మాత్రమే ఉంటుందన్నారు. బుందేల్‌ఖండ్ భూమికి ఈ ఎక్స్‌ప్రెస్‌వే ను బహుమతిగా అందించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఇక్కడి వాహనాలకు వేగాన్ని అందించడమే కాకుండా మొత్తం బుందేల్‌ఖండ్ పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి గత ప్రభుత్వాలు మిమ్మల్ని మోసం చేశాయని, కానీ మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మిమ్మల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని మోడీ వ్యాఖ్యానించారు.
ఊపందుకున్న కారిడార్ పనులు..
కాగా బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ, చిత్రకూట్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. 9-10 గంటల నుంచి కేవలం ఆరు గంటలకు తగ్గిస్తుంది. రాబోయే ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్ట్ విజయవంతానికి బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే కూడా కీలకం. కాగా.. ఇప్పటికే.. బందా, జలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో 5,071 హెక్టార్లలో రూ.20,000 కోట్లతో డిఫెన్స్ కారిడార్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. రాష్ట్రంలో 3,200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 13 ఎక్స్‌ప్రెస్‌వేలలో ఏడింటిలో ఆరు పనులు కొనసాగుతున్నాయి. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలకు అనుసంధానంగా పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తున్నారు.
Tags: Modi launched Bundel Khand Way