Modi Local-Vocal Slogan To Give China Intelligence!

చైనాకు బుద్ధి చెప్పేందుకే మోదీ లోకల్‌-వోకల్ నినాదం!

Date:13/05/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోయింది. ఇటువంటి పరిస్థితిలో భారత ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.లాక్‌డౌన్‌ 4.0 ను సూచిస్తూ, దేశంలో లోకల్‌-వోకల్ ఫార్ములా అమలవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఫార్ములా ప్రకారం మన దేశం మునుపటి మాదిరిగా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దేశీయంగానే ఉత్పత్తులను సాగిస్తూ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, చైనా ఉత్పత్తుల ఆధిపత్యాన్ని తగ్గించనుంది.ఇందుకోసం ఆయా ప్రాంతాలలో తయారు చేసిన వస్తువుల వాడకానికి ప్రాధాన్యత కల్పించనున్నారు. దీనికి పీపీఈ కిట్‌లనే ప్రధాని మోదీ ఉదాహరణగా చూపారు.దేశంలో తయారైన ఉత్పత్తులను అధికంగా ఉపయోగించాలని ప్రధాని మోడీ నొక్కిచెప్పడానికి చైనాతో భారతదేశ దౌత్య సంబంధమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రపంచమంతా కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తూ, ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ప్రయత్నిస్తుండగా, చైనా ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తూ, తద్వారా లభించిన ఆదాయంతో తన రహస్య కార్యకలాపాలను కొనసాగిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 

 

 

అలాగే చైనా పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. దీనికి చైనా – భారత సైన్యాల మధ్య లడఖ్, సిక్కింలలో చోటుచేసుకున్న ఘటనలే ఉదాహరణలుగా నిలిచాయి. ఇటువంటి పరిస్థితిలో ఆసియాలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని తగ్గించే సామర్ధ్యం భారతదేశానికి ఉంది.ఈ నేపధ్యంలో మోదీ చెప్పిన లోకల్‌-ఓకల్ ఫార్ములా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మొబైల్స్, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్స్, లైటింగ్ సహా అనేక ఉత్పత్తులు చైనా నుండి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. చైనా తన ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ సొమ్మును తన దేశాన్ని అభివృద్ధి చేయడానికి, ఆసియాపై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి చైనా ఉపయోగిస్తుంది.దౌత్య స్థాయిలో చైనా చేస్తున్న ఈ చర్యను అధిగమించి, భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకే ప్రధాని మోదీ లోకల్- వోకల్ నినాదం ఇచ్చారు.

జిల్లాలో కొత్తగా 11పాజిటివ్‌ కేసులు!

Tags: Modi Local-Vocal Slogan To Give China Intelligence!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *