గ్రేటర్ కార్పొరేటర్లతో మోడీ భేటీ

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణపై బీజేపీ గట్టి గురిపెట్టిందనడానికి వరుస పరిణామాలే నిదర్శనం. అగ్రనేతలంతా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుండటమే అందుకు ఉదాహరణ. గతనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో బిజెపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. ఆయన పర్యటనలో స్వాగతం, వీడ్కోలు పలికే దగ్గర చోటామోటా బిజెపి నేతలకు అవకాశం వచ్చింది. గ్రేటర్ కార్పొరేటర్ లను కూడా కలిసే కార్యక్రమం ప్రోగ్రామ్ లో వున్నా, వర్షం రావడంతో వాయిదా పడింది. మోడీని కలవాలనుకున్న కార్పొరేటర్లు, వర్షం రావడంతో తీవ్ర నిరాశ చెందారు.అయితే, కార్పొరేటర్లు నిరుత్సాహపడ్డారని భావించిన రాష్ట్ర బీజేపీ నాయకులు, కలిసే అవకాశం ఇవ్వాలని ప్రధాని కార్యాలయానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దీంతో ప్రధాని వారికి టైమ్ ఇచ్చారు. గ్రేటర్ కార్పొరేటర్లు, గ్రేటర్  పరిధిలో ఉండే రాష్ట్ర పదాధికారులు, ఆపై స్థాయి నేతలు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు.మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెలలో మోడీ హైదరాబాద్ కి వస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చి 15 రోజులు కూడా కావడం లేదు. అలాంటిది వీరికి సమయం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో చాలా మునిసిపల్ కార్పొరేషన్ లు బిజెపి చేతిలో ఉన్నాయి.

 

 

వాళ్లకు ఇవ్వని సమయాన్ని తెలంగాణ కు ఇచ్చారని, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమని అంటున్నారు.మోడీ ఏది చేసినా దాని వెనుక ఓ లెక్క ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. బలమైన సంకేతాలు ఇవ్వడం కోసమే, మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. తెలంగాణపై తానే స్వయంగా రంగంలోకి దిగాను అనే సిగ్నల్ ఇవ్వడం కోసమే, చోటామోటా నేతలకు సైతం మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. దీంతో కార్పొరేటర్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, పార్టీ కార్యకర్తల్లో జోష్ వస్తుందని చెబుతున్నారు. రాజకీయంగా చర్చ జరుగుతుందని, కార్పొరేటర్ లకు మోడీ టైమ్ ఇవ్వడంపై ప్రజల్లో కూడా డిస్కషన్ జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు, బీజేపీ కార్పొరేటర్ లు కూడా పార్టీ జంప్ అవుతారన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. అధికార trs తో టచ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మోడీని కలిపిస్తే కార్పొరేటర్ లు కూడా తమ ఆలోచన మార్చుకుంటారని, పార్టీ కోసం పని చేస్తారనే టాక్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి కార్పొరేటర్లకు మోడీ అపాయింట్ మెంట్ తో, బీజేపీ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది.

 

Post Midle

Tags: Modi meets Greater Corporators

Post Midle
Natyam ad