స్వాతంత్ర్య సమరయోధుడి కుమార్తెకు పాదాభివందనం చేసిన మోదీ!

భీమవరం  ముచ్చట్లు:


స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. ఆ సమరయోధుడి కుమార్తె 90 ఏళ్ల పసల కృష్ణ భారతిని కలవడమే కాకుండా ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు  ఆమె సోదరి, మేనకోడలు వద్ద నుంచి కూడా మోదీని ఆశీర్వదాలు తీసుకున్నారు.పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలోని పశ్చిమ విప్పర్రు గ్రామంలో 1900లో జన్మించిన పసల కృష్ణమూర్తి 1921లో తన సతీమణితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధేయవాది అయిన ఆయన ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఒక ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన 1978లో కన్నుమూశారు. ఈ మేరకు మోదీ ఏపీలో పర్యటించడమే కాకుండా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామారాజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.

 

Tags: Modi saluted the freedom fighter’s daughter!

Leave A Reply

Your email address will not be published.