ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీ నమ్మకద్రోహం చేశారు

Modi was betrayed by the people of Andhra Pradesh

Modi was betrayed by the people of Andhra Pradesh

Date:11/01/2019
పెద్దాపురం ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా,16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రన్న అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు  68 ఏళ్ల వయస్సు లో ముఖ్యమంత్రి  ఇంత కష్ట పడుతుంటే,హోదా ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి తెలుగు ప్రజలకు మోడీ నమ్మకద్రోహం చేసారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం అయన పెద్దాపురం జన్మభూమి కార్యక్రమంలో పాల్గోన్నారు.  లోకేష్ మాట్లాడుతూ మోడీ మొనర్క్ లా వ్యవహరిస్తున్నారు. ఆర్బీఐ,సీబీఐ వ్యవస్థలను బ్రష్టుపట్టించారు.ఆఖరికి సుప్రీం కోర్టు తీర్పు ని కూడా లెక్క చెయ్యను అని మోడీ గారు అంటున్నారు. హోదా కోసం పోరాటం చేస్తుంటే పార్లమెంట్ సాక్షిగా మీ అంతు చూస్తాం అని బెదిరిస్తారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి నిలదీస్తే ఐటీ రైడ్స్ చేయించారని విమర్శించారు.
విశాఖ రైల్వే జోన్ కావాలి అని అడిగితే ఈడీ కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్నా, తెలుగు ప్రజలు అన్నా మోడీ కి  చులకన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ని లుచ్చా అని రాష్ట్ర బీజేపీ నాయకులు అంటుంటే మోడీ  ఆనందంగా నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్మూ, ధైర్యం ఉంటే రాష్ట్రానికి న్యాయం చెయ్యమని మోడీ దగ్గర పోరాటం చెయ్యాలి. టిడిపి ఢిల్లీ పై పోరాటం చేస్తుంటే మోడీ జగన్ తో జోడి కట్టారు. అందుకే ఆయన పై ఉన్న 420 కేసు మొదటికి వచ్చింది. కోడి కత్తి కేసు ఎన్ఐఏ కి అప్పగించారు. హోదా ఇవ్వాల్సిన మోడీ ని  దొంగ అబ్బాయి విమర్శించడు. పాదయాత్ర ముగింపు సభలో గంటన్నర మాట్లాడిన దొంగ అబ్బాయి మోడీ గారు పేరు కూడా ఎత్తలేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్ ఊసే లేదు.
కేవలం ముఖ్యమంత్రి  తిట్టడానికి మాత్రమే సభ పెట్టుకున్నారని మండిపడ్డారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు వద్దు ఈ దొంగ అబ్బాయి అంటున్నారు. వైకాపా ఒక డ్రామా కంపెనీ. మొదట రాజీనామా డ్రామా,తరువాత కోడి కత్తి డ్రామా,ఇప్పుడు ఆవు-ఆంబులెన్స్ డ్రామా. అందుకే ఆయన పేరు జగన్ మోహన్ రెడ్డి కాదు,జగన్ మోడీ రెడ్డి అని వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ,సంక్షేమం కొనసాగాలి అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గా చంద్రబాబు  రావాలని లోకేష్ అన్నారు.
Tags:Modi was betrayed by the people of Andhra Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *