‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ

‘ప్రధాని’గా బాధ్యతలు స్వీకరించిన‌ ‘మోదీ

‘న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

9.30కోట్ల రైతులకు, రూ.20వేల‌ కోట్ల ఆర్థిక సాయం విడుదలపై తొలి సంతకం కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య్ పథ్ వేదికగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్లమెంట్‌ పరిధిలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న పీఎంవో కార్యాలయంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఆ వెంటనే పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్‌ పై తొలి సంతకం చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న 9.30 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం విడులైంది. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు.

 

 

Tags:’Modi’ who took charge as ‘Prime Minister’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *