బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మోడీ జన్మదిన వేడుకలు
విజయవాడ ముచ్చట్లు:
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. యువ మోర్చా కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మోడీ 72వ జన్మదినోత్సవం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. భారతదేశమంతా నేడు మోడీ పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. రక్తదాన శిబిరాలు, వస్త్రాలు, పండ్లు పంపిణీ, వంటి సేవా కార్యక్రమాలు చేశారు. బిజెపి పక్షాన ఆర్భాటాలు లేకుండా అన్నదానం, మొక్కల నాటడం వంటి కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచింది. ప్రతి యేడాది సామాజిక కార్యక్రమాలలో బిజెపి శ్రేణులను భాగస్వామ్యం చేశారు. యుగానికి ఒక యుగ పురుషుడు పుడతారంటారు.. అతనే నరేంద్ర మోడీ. మోడీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి చెందుతుందని అన్నారు.
ఆర్ధిక వ్యవస్థ కుదేలైనా తిరిగి గాడిలో పెట్టిన ఘనత మోడీ కే దక్కుతుంది. ప్రజల కోసం, దేశం కోసం ఆలోచన చేసే మోడీ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈకార్యక్రమంలో.. జిల్లా బిజెవైఎం అద్యక్షుడు రవ్వా హరీష్ ,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రశివన్నారాయణ, బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్ట వంశీ ,మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ,బిజెపి నేతలు అడపా నాగేంద్ర ,నాగభూషణం ,జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రత్న కుమారి ,నాగలక్ష్మి ,శ్రీ నివాస్ ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Modi’s birthday celebrations at BJP state office

