ఘనంగా మోడీ పుట్టినరోజు వేడుకలు

Date:17/09/2019

గాంధీనగర్ ముచ్చట్లు:

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు 69వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ప్రపంచంలోనే విశేష ఆదరణ కలిగిన నేత మోదీ.. ఆయన పుట్టినరోజు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ సృష్టిస్తోంది. హ్యాష్‌ట్యాగ్‌ బర్త్‌డే మోదీ పేరుతో ప్రపంచంలోనే అత్యధిక మంది అనుసరిస్తున్న వరుసలో మూడో స్థానంలో నిలిచింది. కొన్ని మిలియన్ల ప్రజలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, సినీ తారలు, నెటిజన్స్‌ ఈ జాబితాలో ఉన్నారు.

 

 

 

మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఇప్పటివరకు 11 లక్షల 37 వేల మంది ట్విట్టర్‌ ద్వారా విషెస్‌ తెలిపారు. ఇండియాలో టాప్‌-10 ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో మోదీ పుట్టినరోజుకు సంబంధించినవే ఏడు ఉండడం గమనర్హం. సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరి బీచ్‌లో మోదీ భారీ బొమ్మ గీసి, తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్న పిల్లలు సైతం పాట రూపంలో ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలుపడం విశేషం.భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు 69వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ నేడు గుజరాత్‌లోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మోదీ నర్మదా జిల్లా కేవడియాలోని బట్టర్ ఫ్లై గార్డెన్ (సీతాకోకచిలుకలు) సందర్శించి..సీతాకోకచిలుకలను గాల్లోకి ఎగరేశారు. అదేవిధంగా కాక్టస్ గార్డెన్‌కు వెళ్లారు. ఖాల్వని ఎక్ టూరిజం స్థలాన్ని సందర్శించారు.

 

 

 

 

అనంతరం సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాంతాన్ని సందర్శించారు. డ్యామ్‌పై పూజలు చేశారు.మోదీ నర్మదా పరివాహక ప్రాంతంలో ఏక్తా నర్సరీని సందర్శించి..అక్కడ ఉత్పత్తి చేసే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ వెంట గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవ్ రాత్ ఉన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మోదీ గురుదేశ్వర్ దత్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

31 నాటికి కమాండ్ కంట్రోల్ రూమ్

Tags: Modi’s birthday celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *