మూడు రాష్ట్రాలపై మోదీ ఫోకస్ 

Modi's focus on three states

Modi's focus on three states

Date:20/05/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ‌అంచనాలను వెలువరించాయి. ఎన్డీయే కూటమికి 306 స్థానాలు దక్కుతాయని టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలో వెల్లడైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడం, మోదీ మళ్లీ ప్రధాని పీఠంపై కూర్చోవడం ఖాయం. ఈ దఫా లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోదీ.. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ముఖ్యంగా మూడు రాష్ట్రాలపై మోదీ ఫోకస్ పెట్టి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లపై మోదీ ప్రధానంగా దృష్టి సారించారు. మోదీ ఎన్నికల ప్రచారం 40 శాతం ఈ మూడు రాష్ట్రాల్లోనూ సాగిందంటే… ఆయన ఈ రాష్ట్రాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. యూపీలో 2014 నాటి సీట్లను నిలబెట్టుకోవడంతోపాటు.. మమత, నవీన్ పట్నాయక్‌ల కంచు కోటలను బద్దలు కొట్టే దిశగా మోదీ వ్యూహాలు రచించారు.

 

 

 

 

 

 

 

 

 

 

లోక్ సభ ఎన్నికల్లో మోదీ 141 ర్యాలీల్లో పాల్గొనగా.. 55 ర్యాలీలు (39 శాతం) బెంగాల్, యూపీ, ఒడిశాల్లో నిర్వహించినవే. 2014లో యూపీలో 71 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి 58 స్థానాలను నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒడిశాలో 21 స్థానాల్లో బీజేపీ 12 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. 2014లో కమలం పార్టీ ఇక్కడ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.పశ్చిమ బెంగాల్లో ఎన్డీయేకి 11 స్థానాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. 2014లో బీజేపీకి ఇక్కడ రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. బెంగాల్, ఒడిశాల్లో మోదీ వ్యూహాత్మక ప్రచారం వల్ల పార్టీకి అదనంగా 20 సీట్లు దక్కనున్నాయి. యూపీలో ఆయన ప్రచారం చేయడం వల్ల ఎస్పీ-బీఎస్పీ కూటమి సవాల్‌కు బీజేపీ ధీటైన జవాబు ఇవ్వగలిగింది.

 

డిజాస్టార్ గా నిలుస్తున్న కియారా 

 

Tags: Modi’s focus on three states

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *