మోడీ హెలికాఫ్టర్ తనిఖీ చేసిన అధికారిపై వేటు 

Date:22/04/2019

ముంబై ముచ్చట్లు :
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్న హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఎన్నికల అధికారిపై ఈసీ వేటు వేసింది. ఒడిశాలోని సంబల్‌పూర్‌లో జనరల్ అబ్జర్వర్‌గా విధులు నిర్వర్తించిన ఆయన.. ఏప్రిల్ 16న ప్రధాని హెలికాప్టర్‌లో తనిఖీలు చేశారు. నిబంధనల ప్రకారం ఎస్పీజీ భద్రత ఉన్న నాయకులకు తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ నిబంధనలను ఉల్లంఘించడంతో 1996 కర్ణాటక బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మహ్మద్ మోహ్సిన్‌ను కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు రిపోర్ట్ చేయాలని ఈసీ ఆదేశించింది. గత మంగళవారం ప్రధాని మోదీ సంబల్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహ్మద్ మోహ్సిన్.. మోదీ కాన్వాయ్‌‌లోని లగేజీని చెక్ చేయడానికి ప్రయత్నించారు. ‘జనరల్ అబ్జర్వర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న అధికారికి ఎస్పీజీ సెక్యూరిటీ ఉన్న నాయకులను తనిఖీ చేయొద్దనే నిబంధన తెలిసి ఉండాలి. విధి నిర్వహణలో అశ్రద్ధగా వ్యవహరించడంతో అతడిని సస్పెండ్ చేశాం’ అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్, డీఐజీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మహ్మద్ మోహ్సిన్‌ను సస్పెండ్ చేశామని ఈసీ తెలిపింది. ప్రధాని సహా ఎస్పీజీ భద్రత కల్పిస్తోన్న నాయకులను, వారి కాన్వాయ్‌ను తనిఖీల నుంచి మినహాయించాలని 2014 ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Tags:Modi’s helicopter checked officer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *