మొగుడికి పెళ్లి చేసిన భార్య

తిరుపతి ముచ్చట్లు:


సాధారణంగా భర్తలు వేరొక స్త్రీల వలలో పడకుండా ఓ కంట కనిపెడుతూ ఉంటారు భార్యలు. ఒక వేళ పరాయి స్త్రీలతో సంబంధాలుంటే నానారబస చేసి భర్తకు బుద్ధి వచ్చేలా చేస్తారు. ఐతే ఓ భార్య అందుకు విరుద్ధంగా భర్త ప్రేమించిన టిక్‌టాక్‌ యువతితో దగ్గరుండి, అలంకరించి మరీ బుధవారం  రెండో పెళ్లి చేసింది ఓ భార్య. భర్త వేరొక యువతిని ఇష్టపడ్డాడని తెలిసి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానికులందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. టిక్‌టాక్‌లో వీడియోల ద్వారా పాపులర్‌ అయిన అతనికి తొలుత విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారితీసింది. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నా.. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ టిక్‌టాక్‌లోనే పరిచయమైన కడపకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో తొలుత ప్రేమించిన విశాఖపట్నం టిక్‌టాక్‌ ప్రేయసి తిరుపతిలోని ప్రియుడి ఇంటికి సడెన్‌ ఎంట్రీ ఇచ్చింది. ఐతే అప్పటికే అతనికి పెళ్లయిందని తెలుసుకుని, వెనుదిరిగి వెళ్లకుండా యువకుడి భార్యతో మాట్లాడి, అతనిని ప్రేమించానని, అందరం కలిసి ఇదే ఇంట్లో ఉందామని చెప్పడంతో అతని భార్య మొదట కంగారు పడినా చివరకు అంగీకరించింది. దీంతో భర్తను, భర్త ప్రియురాలిని స్వయంగా అలంకరించి, ఇద్దరికీ వివాహం జరిపించింది.

 

Tags: Mogudi’s married wife

Leave A Reply

Your email address will not be published.