ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్ లో మహ్మద్ కైఫ్

Mohammad Kaif in the Delhi Daredevils Team

Mohammad Kaif in the Delhi Daredevils Team

Date:19/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీలో భాగం కానున్నాడు. గతంలో గుజరాత్ లయన్స్ కోసం పని చేసిన కైఫ్.. వచ్చే సీజన్లో ఢిల్లీకి సేవలు అందించనున్నాడు. అసిస్టెంట్ ప్రవీణ్ ఆమ్రేతో కలిసి టాలెంట్ స్కౌట్స్‌గా పని చేయనున్నాడు. వీరిద్దరూ కలిసి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురానున్నారు. ఐపీఎల్ వేలం ప్ర్రక్రియలో ఢిల్లీకి వీరి సేవలు కీలకం కానున్నాయి. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కైఫ్.. భారత్ తరఫున 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ జట్టులో మార్పులు చేస్తోంది. రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. ఇప్పటి వరకూ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ నెగ్గలేదు. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. 2018 సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో ఫ్రాంచైజీ పేరు మార్చే దిశగానూ యాజమాన్యం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Tags:Mohammad Kaif in the Delhi Daredevils Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *