35 ఏళ్ల వయస్సుకి మోహన్ లాల్

Mohan Lal is 35 years old

Mohan Lal is 35 years old

Date:05/11/2018

తిరువనంతపురం ముచ్చట్లు:

మూవీ లెజెండ్ మెహ‌న్ లాల్ మలయాళంలో నటిస్తున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓడియ‌న్’. ఈ చిత్రానికి అక్క‌డే కాకుండా తెలుగు ట్రేడ్‌లో కూడా చాలా మంచి క్రేజ్ వుంది. ఈ చిత్రంకోసం మెహ‌న్ లాల్  యోగా,  వ్యాయామాలు చేసి త‌న వ‌య‌సుని 55 సంవ‌త్స‌రాల నుండి 35 సంవ‌త్స‌రాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని న‌టించడం విశేషం. అద్భుతమైన గ్రాఫిక్స్ తో నిర్మిస్తుండ‌టంతో ఈ క్రేజీ ప్రాజెక్టుకి సౌత్ ఇండియా అంతా హ్యూజ్ క్రేజ్ వ‌చ్చింది. టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది బ‌డా నిర్మాత‌లు పోటిప‌డినా కూడా దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన ద‌గ్గుపాటి అభిరామ్, సంప‌త్ కుమార్ ఈ చిత్రం తెలుగు హ‌క్కులు పొంద‌టం విశేషం. ఈ అవ‌కాశాన్ని అందించిన మెహ‌న్ లాల్  నిర్మాత‌లు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగులో ఏక‌కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.మోహన్ లాల్  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్టామినా ఎంతో చాలా సినిమాల్లో చూసాం. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఆయన నటిస్తున్న ఓడియన్ చిత్ర తెలుగు హక్కుల్ని మా దగ్గుబాటి క్రేయేషన్స్ సొంతం చేసుకుంది. సినిమా కున్న  క్రేజ్ దృష్ట్యా పోటీ పడీ ఈ సినిమా హక్కులు పొందాం. దర్శకుడు శ్రీ కుమార్ మీనన్, మోహన్ లాల్ 35 సంవత్సరాల వయసున్న వైవిధ్యమైన పాత్రలో చూపించనున్నారు. దీనికోసం 55 సంవత్సరాల వయస్సులో మోహన్ లాల్ యోగాసనాలు వంటి ప్రక్రియలు చేయడం హ్యాట్సాఫ్. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఈ సినిమా హక్కులు మాకు ఇచ్చినందుకు మోహన్ లాల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మలయాళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేయనున్నాం. అని అన్నారు.

17 మిలియన్ వ్యూస్ దాటిన ఏడు చేపల కథ

Tags:Mohan Lal is 35 years old

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *