ఏప్రిల్ 12 న సురేష్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్న మోహన్ లాల్ ‘లూసిఫర్’ చిత్రం..!!

Mohanlal 'Lucifer' will be released on April 12th by Suresh Productions.

Mohanlal 'Lucifer' will be released on April 12th by Suresh Productions.

Date:05/04/2019
హైదరాబాద్‌ముచ్చట్లు:
జనతా గ్యారేజ్, మనమంతా,మన్యం పులి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఇప్పటికే మలయాళం లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12  న విడుదల చేయనున్నారు. నిన్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఆ ట్రైలర్ కి మంచి స్పందన లభించింది… ట్రైలర్ చూసినంత సేపు చాలా ఆసక్తికరంగా సాగింది. మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్,  టివినో థామస్, సానియా ఐయప్పన్, సాయి కుమార్, నీల ఉషా, కళాభవన్ షాజోన్ నటించిన ఈ సినిమాకి మలయాళ అగ్రనటుడు, కథానాయకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు.. దీపక్ దేవ్ సంగీతం సమకూర్చగా సుజిత్ వాసు దేవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు: మోహన్ లాల్,పృథ్వీరాజ్ సుకుమారన్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, టివినో థామస్, సానియా ఐయప్పన్, సాయి కుమార్, నీల ఉషా, కళాభవన్ షాజోన్ తదితరులు
Tags: Mohanlal ‘Lucifer’ will be released on April 12th by Suresh Productions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *